YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కన్నా యాక్టివ్ అయ్యారే...

కన్నా యాక్టివ్ అయ్యారే...

గుంటూరు, మార్చి 10, 
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మళ్లీ యాక్టివ్ అయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని కింగ్ మేకర్ గా మారాలనుకుంటున్నారు. గుంటూరు కార్పొరేషన్ లోని అన్ని డివిజన్ లలో బీజేపీ, జనసేన అభ్యర్థులను బరిలోకి దింపారు. ఈ ఎన్నికలు కన్నా లక్ష్మీనారాయణకు ప్రతిష్టాత్మకం.కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేరు. మరో మూడేళ్ల వరకూ ఎన్నికలు లేవు. దీంతో బీజేపీతో పాటు ఏ పార్టీ ఆయనను పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. గతంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. బీజేపీకి ఏపీలో పెద్దగా ఓటు బ్యాంకు లేకపోవడం, వచ్చే ఎన్నికల సమయానికి కూడా బీజేపీ ఎదుగుతుందన్న నమ్మకం లేకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళ్లాలని భావించారంటారు.అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగాలేదు. దీంతో పాటు తన ప్రత్యర్థి రాయపాటి సాంబశివరావు సయితం టీడీపీలోనే ఉన్నారు. వైసీపీిలోకి వెళ్లాలనుకున్నా అక్కడ ప్లేస్ లేదు. సీనియర్ నేతలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి లాంటి వారిని జగన్ పక్కన పెట్టారు. వైసీపీలో చేరడం కంటే బీజేపీలోనే ఉండి తన శక్తి నిరూపించుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారు.అందుకు జనసేన, టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేస్తేనే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. తాను బీజేపీలోనే ఉండి టీడీపీని కూటమి చెంతకు చేరవేయాలన్నది కన్నా లక్ష్మీనారాయణ ప్రయత్నంగా ఉంది. ఇందుకు గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలను వేదికగా నిర్ణయించుకున్నారు. ఇక్కడ బీజేపీ, జనసేన అభ్యర్థులు గెలిస్తే టీడీపీతో కలసి కార్పొరేషన్ ను కైవసం చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. గుంటూరు నుంచే నేరుగా కూటమికి అడుగులు పడాలని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. అందుకే ఆయన యాక్టివ్ అయ్యారంటున్నారు.

Related Posts