YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బెజవాడ వైసీపీలో విబేధాలు...

బెజవాడ వైసీపీలో విబేధాలు...

విజయవాడ, మార్చి 10, 
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి నానా కష్టాలు పడుతోంది. వైసీపీకి అనుకున్న విధంగా పరిస్థితులు మాత్రం కనపడటం లేదు. ముఖ్యంగా విజయవాడ వైసీపీ నేతల మధ్య సమన్వయం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. విజయవాడలో చాలా మంది వైసీపీ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత తమకు ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన కొంతమంది నేతలు పార్టీని పక్కన పెట్టేసారు.ఇక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విభేదాలతో కొంతమంది నేతలు బయటకు రావడం లేదనే ప్రచారమూ ఉంది. తెలుగుదేశం పార్టీ ని ఇబ్బంది పెట్టాలని చూసినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. దీంతో ప్రచారం చేయడానికి కూడా కొంత మంది లోకల్ లీడర్లు ముందుకు రావడం లేదు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో కూడా పార్టీకి కొందరు దూరంగా ఉంటున్నారని టిడిపి వర్గాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.అయితే దీని మీద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టి పెట్టారని స్థానిక నేతలకు ఆయన వ్యక్తిగతంగా హామీలు ఇస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా చెబుతోంది. అయినా సరే ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలు విజయవాడలో ప్రచారం చేయడానికి ముందుకు రాకపోవడంతో మంత్రులు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ నేతలే అంటున్నారు. ఇటీవల అగ్ర నేతలు ప్రచారం నిర్వహించిన సరే వాళ్ళు ముందుకు రాలేదని దీంతో పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అని అంచనా వేస్తున్నారు

Related Posts