విజయవాడ మార్చి 10,
ఆంధ్రప్రదేశ్లో బుధవారం జరిగిన మునిసిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. ఎన్నికల నేపథ్యంలో పలువురు అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విజయవాడలోని వివిధ పోలింగ్ బూత్లను పరిశీలించారు. పోలింగ్ జరుగుతోన్న తీరుపై ఆయన అధికారులతో పాటు ఓటర్లను అడిగి తెలుసుకున్నారు.వృద్ధులు, దివ్యాంగులకు పోలింగ్ బూత్ ల వద్ద అన్ని రకాలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయనకు అధికారులు చెప్పారు. పలు చోట్ల ఎస్ఈసీకి ఓటర్లు కొన్ని ఫిర్యాదులు చేశారు. విజయవా డలో రాజకీయంగా చైతన్యం ఉందని నిమ్మగడ్డ చెప్పారు.ఆ ప్రాంతంలో పోలింగ్ శాతం ఈసారి పెరుగుతుందని తెలిపారు. కరోనా సోకిన వారు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్దకు ఆఖరి గంటలో రావాలని సూచిం చారు. కరోనా డెస్క్ తో పాటు హెల్త్ డెస్క్లను నిమ్మగడ్డ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓట్లు వేసేందుకు వచ్చిన వృద్ధులను ఆయన అభినందించారు. వారు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు.