నిర్మల్ మార్చి 10,
గడిచిన 48 గంటల నుండి బైంసా పట్టణం ప్రశాంతంగా ఉందని నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేయడం జరిగింది. 15 కేసులలో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసామని అన్నారు. ఇందులో ఇరు వర్గాలకు సంబందించిన ఇద్దరు ప్రస్తుత కౌన్సిలర్లను అరెస్ట్ చేసాం. ప్రస్తుతం 24 మంది అనుమానితులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు పుకార్లను(సమాచారాలను) నమ్మకూడదు. ఇతరులకు తప్పుడు సమాచారాలను పంపకూడదని అయన హెచ్చరించారు.