YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వివాదంగా మారిన బ్రాండ్ అంబాసిడర్ నియామకం

వివాదంగా మారిన బ్రాండ్ అంబాసిడర్ నియామకం

మహబూబ్ నగర్ మార్చి 10,
తెలంగాణా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా  దేత్తడి హారిక నియామకం వివాదంగా మారింది.  సోమవారం ఆమెకు టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియామక పత్రం అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె నియమానికి  ప్రభుత్వ అనుమతి లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు. మంత్రి మాట్ఆడుతూ తెలంగాణా ఇమేజీ పెంచేలా బ్రాండ్ అంబాసిడర్ను పెడతామని అన్నారు. శ్రీనివాస్ గుప్తాతోనూ ఫోన్లో మంత్రి మాట్లాడారు. అయితే హారికనే బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతుందని శ్రీనివాస్ గుప్తా తేల్చి చెప్పినట్లు సమాచారం. మంత్రి మాట్లాడుతూ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ నియామకం పై ఏలాంటి సమాచారం లేదు. త్వరలో ముఖ్యమంత్రి తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. హారిక ఎంపిక విషయంలో చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎంతో మంది గుర్తింపు పొందిన వాళ్లు వున్నారు. కొంతమంది పేర్లు ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమించే విషయంలో ఎవరి సొంత నిర్ణయాలు వుండవు. ఎవరైన సొంత నిర్ణయలు తీసుకుంటే అది ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు.

Related Posts