మార్చి 10
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం ఇందిరా నగర్ కు చెందిన వడ్డే లక్ష్మమ్మ( 85 ) తన కోడలు తో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకొని కన్ను మూశారు. బుధవారం స్థానిక 20 వ వార్డు ఇందిరా నగర్ కు వడ్డే లక్షమ్మ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల ఒటింగ్ కోసం స్థానిక మాచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠాశాల లో ఏర్పాటు చేసిన పొలంగ్ బూత్ లో లక్ష్మమ్మ ఉదయం 10 గంటల సమయంలో కోడలు తో కలిసి వెళ్లి ఓటు వేసింది. అనంతరం ఇంటికి వెళ్ళింది. కాలినిలో అందరిని ఆప్యాయంగా పలకరించింది లక్షమ్మ. ఉన్నట్టుండి గొంతులో గళ్ళ అడ్డంగా పడినట్లు ఉందని కుటుంబ సభ్యులు కు చెప్పింది. దీంతో మంచి నీళ్ళు త్రాగించే ప్రయత్నం చేశారు. లక్ష్మమ్మ ఒక్కసారిగా మాట రాక అల్లడిపోయి తుదిశ్వాస విడిచారు. లక్ష్మమ్మ కు 2 కుమారులు 4 కుమార్తెలు ఉండగా భర్త 20 ఏళ్ల కిందట మరణించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువ తెలిసిన లక్ష్మమ్మ తన వయోభారంలో కూడా ఓటు హక్కు వినియోగించుకొని మరణించడం పలువురినిరి కంట తడి పెట్టించింది,