YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రచార వేదికలుగా మారిన పాఠశాలలు, విద్య సంస్థలు చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం:పిసిసి అధికార ప్రతినిధి నిరంజన్

ప్రచార వేదికలుగా మారిన పాఠశాలలు, విద్య సంస్థలు  చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం:పిసిసి అధికార ప్రతినిధి నిరంజన్

హైదరాబాద్ మార్చ్ 10 
రాష్ట్రంలో పాఠశాలలు, విద్య ప్రచార వేదికలుగా మారాయని ఎన్నికల సంఘం చోద్యం చూస్తు ఏమి చేయలేని స్టితి లో ఉందని  పిసిసి అధికార ప్రతినిధి నిరంజన్ విమర్శించారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ దీనిని బట్టి చూస్తే ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందన్నారు.టిఆర్ఎస్, బీజేపీ లు విచ్చలవిడిగా ధన ప్రభావం మందు అడ్డగోలుగా పంపిణీ చేస్తున్నారాణి ఆరోపించారు.కేటీఆర్, హరీష్ రావు,  బీజేపీ, అనేక విద్య సంస్థలలో, ఉస్మానియా యూనివర్సిటీ లో, ఎస్హిబిషన్ సొసైటీలో సమావేశాలు పెట్టి ఓట్లు అడుగుతున్నారు.గంగుల కమలాకర్ మంత్రి రేషన్ డీలర్లకు 500 ఓట్లు వేయించాలని టార్గెట్ పెట్టారు.జర్నలిస్టులకు ఇప్పుడే చెక్ లు ఇస్తామని హామీలు ఇస్తున్నారు.ఈ మధ్య కేటీఆర్ బెస్ట్ ఐ.టి మంత్రి అని ఎవరో అవార్డు ఇచ్చినట్టు ప్రకటించారు..ఇవన్నీ అంశాలపై మేము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసాము. ఎన్నికల సంఘం ఇవన్నీ తప్పులు అని అంటున్నారు కానీ చర్యలు తీసుకోవడం.లేదని ఆవీదన వ్యక్తం చ్వ్హేసారు.నిన్న ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ మూడు గంటలపాటు సమావేశం అయ్యారు.మూడేళ్ళ కింద పీఆర్సీ కమిటీ వేస్తే ఇప్పటి వరకు ఏం చేశారు.కోడ్ అడ్డంగా ఉందని అంటున్నారు. మరి ఉద్యోగ సంఘాలతో సమావేశం కావడం కోడ్ ఉల్లంఘన కాదా..ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తన అధికారాలను ఉపయోగించి  తన నిజాయితిని నిరూపించుకోవాలని నిరంజన్ డిమాండ్ చేసారు.

Related Posts