డెహ్రాడూన్ మార్చ్ 10
ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరత్ సింగ్ రావత్ ఎంపికరయ్యారు. ఆయన బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేసారు. డెహ్రాడూన్‌లోని బీజేపీ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లెజిస్లేచర్ మీటింగ్‌లో ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ పాలనపై ఆరోపణలు రావడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త సీఎం తీరత్ సింగ్ వయసు 56 ఏళ్లు. ఆయన బీజేపీ ఎంపీ. ఉత్తరాఖండ్‌లో 2013 నుంచి 2015 వరకు ఆయన ఉత్తరాఖండ్ పార్టీ చీఫ్‌గా చేశారు. గతంలో ఎమ్మెల్యేగా చేశారు. కేంద్ర మంత్రి రమేశ్ పోక్రియాల్ నిషాంక్, మంత్రి ధాన్ సింగ్ రావత్ .. కొత్త సీఎంను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.