YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఓటు గల్లంతు... ఎన్నికల సంఘం పై మంత్రి ఆగ్రహం

డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఓటు గల్లంతు...  ఎన్నికల సంఘం పై మంత్రి ఆగ్రహం

ఏలూరు మార్చ్ 10, 
:ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్ల జాభితా లో ఎన్నో ఫిర్యాదులు రావడంతో ఎన్నికలు ఆపాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేస్తే చివర్లో మళ్లీ ఎన్నికలకి ఆమోదం తెలిపింది.అయితే ఎన్నికల జాబితాలో అక్రమాల వ్యవహారం ఇప్పుడు స్ధానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఆళ్లనానికి కూడా చేదు అనుభవాన్ని మిగిల్చించి. ఈ రోజు  ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు శనివారపుపేటలోని పోలింగ్ బూత్ కు వెళ్లిన డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసేందుకు సిద్ధమైన సమయంలో  ఆయన ఓటు లేదని ఎన్నికల అధికారులు గుర్తించారు. అదే విషయాన్నిడిప్యూటీ సీఎం  నానికి తెలిపారు. దీనితో తో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అయిన తన ఓటే గల్లంతు కావడం ఏంటని వారిని నిలదీశారు. ఆ తర్వాత చేసేదేమి లేక పోలింగ్ బూత్ నుండి ఓటు వేయకుండానే వెనుదిరిగారు.  ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఓటర్ల జాబితా తయాతీలో పలు అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ ఎన్నికలు నిలిపేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు తిరిగి ఎన్నికలకు డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చింది. అయితే ఈ రోజు  ఎన్నికలు జరుగుతున్నాఏలూరు ఎన్నికల ఫలితం మాత్రం ఎప్పుడు వేలువడాలో మళ్ళీ హైకోర్టు చెప్పాల్సిందే .

Related Posts