విశాఖపట్నం మార్చ్ 10
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. జీవీఎంసీ 98వార్డుల్లో 566 మంది, ఎలమంచిలి లో 22వార్డులకు 62మంది, నర్సీపట్నం లో 28వార్డులకు 78మంది పోటీలో ఉన్నారు. మార్చి 9, 2020కి సిద్ధంగా ఉన్న ఓటర్ల జాబితానే పరిగణలోకి తీసుకుంటున్నారు.జీవీఎంసీ నర్సీపట్నం, ఎలమంచిలితో కలిసి మొత్తం 18,05,311మంది ఓటర్లున్నారు.పురపాలక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ కేంద్రాల్లో వీడియో గ్రాఫ్, వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్కేంద్రాల పర్యవేక్షణకు 570 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. కోడ్ పర్యవేక్షణ కోసం రెట్టింపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పోలింగ్ పూర్తయ్యాక ఏయూలో బ్యాలెట్ బాక్సుల్ని భద్రపరించేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలో 190 మొబైల్టీంలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఆర్మ్డ్ గార్డ్, మహిళా పోలీసును నియమించారు.