YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రామరాజ్యం స్థాపనకు కృషి : సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

రామరాజ్యం స్థాపనకు కృషి : సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ మార్చ్ 10  
రామరాజ్యం నుంచి స్ఫూర్తి పొందిన పది సూత్రాలను ఢిల్లీలో అమలు చేస్తున్నామని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఎల్జీ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తాను హనుమంతుడి భక్తుడినని కేజ్రీవాల్‌ చెప్పారు. హనుమంతుడు శ్రీరాముడికి పరమ భక్తుడని, దీంతో తాను వారిద్దరి భక్తుడినని తెలిపారు. అయోధ్య రాజైన రాముడి పాలనలో ప్రజలకు అంతా మంచి జరిగిందని, వారికి ఎలాంటి బాధలు లేవని, అన్ని సౌకర్యాలు ఉన్నాయని అందుకే రామరాజ్యంగా రామాయణంలో పేర్కొన్నారని కేజ్రీవాల్‌ తెలిపారు. అలాంటి రామరాజ్యం నుంచి స్ఫూర్తి పొందిన పది సూత్రాలను తమ పాలనలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరూ కూడా ఆకలిలో నిద్రపోకూడదు, బాలలకు మంచి చదువు, అందరికీ మెరుగైన చికిత్స, 24 గంటల విద్యుత్‌, అందరికీ తాగు నీటి వసతి, అందరికీ ఉపాధి, పేదల కోసం గృహాల నిర్మాణం, మహిళలకు భ్రదత, వృద్ధులను గౌరవించడం, అందరికీ సమాన అధికారాలు వంటివి తమ ప్రభుత్వం పాటిస్తున్నదని తెలిపారు.అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత ఢిల్లీ నుంచి అయోధ్యకు యాత్రల ద్వారా వృద్ధులకు శ్రీరాముడి దర్శన భాగ్యాన్ని ఆప్‌ ప్రభుత్వం కల్పిస్తుందని కేజ్రీవాల్‌ చెప్పారు. ఢిల్లీ ప్రజలంతా కరోనా టీకాలు వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు కూడా సాధారణ ప్రజల మాదిరిగా ఆసుపత్రులకు వెళ్లి, క్యూలో ఉండి వ్యాక్సిన్‌ వేయించుకుని స్ఫూర్తిగా నిలువాలని సూచించారు.
 

Related Posts