విజయవాడ మార్చ్ 10,
ఏపీలో జరుగుతున్న మునిసిల్ ఎన్నికల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటేశారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్ జగన్ పాలన ఎలా ఉందో తెలియాలంటే కనీసం మూడేళ్లు పూర్తవ్వాలన్నారు. అప్పుడే ఒక అంచనాకు రాగలమని అన్నారు. అయితే.. అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రభుత్వాలు సమతూకం పాటించాల్సి ఉంటుందన్నారు. వైఎస్ హయాంలో ఇవి రెండూ సమంగా ఉన్నాయని చెప్పారు.ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి కూడా రాజగోపాల్ మాట్లాడారు. పవన్ పనితీరుపై కితాబిచ్చారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఆయన పార్టీ ఓడిపోయినప్పటికీ.. ప్రజల మధ్య ఉండడం అభినందనీయం అన్నారు లగడపాటి. ఇక తానూ చెప్పిన మాట ప్రకారం.. రాజకీయాలకు దూరంగానే ఉన్నానని సామాన్యుడిగానే పరిశీలిస్తున్నానని చెప్పారు.