అమరావతి మార్చ్ 10,
స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఎంపీటిసి, జడ్పీటిసి ఎన్నికలకు సంబందించిన కేసు కోర్టులో పెండింగ్లోి ఉంది. మార్చి 17 నుండి ఎల్టింసిపై నిమ్మగడ్డ వెళ్లబోతున్నారు. సుమారు ఆయన వారం పాటు శెలవులో ఉన్నట్లే. ఈ మధ్యలో కోర్టులో ఉన్న కేసు తేలుతుందో లేదో తెలియదు.దీనిని బట్టి ఎంపీటీసి, జడ్పీటిసి ఎన్నికలు నిమ్మగడ్డ హయాంలో జరగనట్లే నాన్న అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయితీ ఎన్నికల సమయంలో అధికార ప్రజాప్రతినిధులు, అమాత్యులు, అధికార నేతలను వణికించిన నిమ్మగడ్డ ఆఖరి విడత పంచాయితీ ఎన్నికలలో అధికార ఒత్తిళ్లకు నిమ్మగడ్డ తలొగ్గారని విమర్శలు కొని తెచ్చుకునిఅప్రతిష్టపాలయ్యారు. మునిసిపల్ ఎన్నికల రీ షెడ్యూల్నుి జారీ అంతకు ముందు ఆయనకున్న ఏపీ టిఎన్.శేషన్ పేరును పోగొట్టుకున్నారని రాజకీయ విశ్లేషఖులు అభిప్రయా పడ్డారు. మునిసిపల్ ఎన్నికల రీ షెడ్యూల్ జారీ చేయటం తప్పిదమే అని భావించిన నిమ్మగడ్డ ఒకవేళ తన హయాంలో ఎంపీటిసి, జడ్పీటిసి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. గతంలో జరిగిన తప్పులు పునరావృతం అవకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలున్నాయి.
కానీ ఎల్టినసి శెలవుపై వారం రోజులు నిమ్మగడ్డ వెళుతున్న నేపధ్యంలో ఈ మధ్యలో కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా.. రమేష్ కుమార్ హయాంలో ఎంపీటిసి, జడ్పీటిసి ఎన్నికలు జరిగే అవకాశాలుండవు. ముఖ్య కారణం ఏమిటంటే.. మార్చి 31వ తేదీన నిమ్మగడ్డ రిటైర్డు కాబోతున్న నేపధ్యంలో ఎంపీటిసి, జడ్పీటిసి ఎన్నికలు జరిపించటం సాధ్యపడదని ఆయనకు తెలుసు. అందుకేనేమో వారం రోజుల పాటు ఎల్టిలసి శెలవుపై నిమ్మగడ్డ వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా ఏపీ శేషన్గాా పేరు తెచ్చుకున్న నిమ్మగడ్డ కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా రాజకీయ, అధికార ఒత్తిళ్లకు తలొగ్గి అందుకు మూల్యం చెల్లించుకున్నారని.. పలు టివి ఛానెళ్లలో జరిగిన చర్చల సందర్భంగా అధికార పార్టీయేతర రాజకీయ ప్రతినిధులతో పాటు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ మీడియా ప్రతినిధులు వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. కుటుంబ సమేతంగా వారం రోజుల పాటు అనగా ఈ నెల 17నుండి 24 వరకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళుతున్నట్లుగా ఆయన పెట్టిన శెలవులో వెల్లడైంది.