YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

సైబర్ సెక్యూరిటీ ఏర్పాటుకు టెక్ మహేంద్ర ఫిదా

 సైబర్ సెక్యూరిటీ ఏర్పాటుకు టెక్ మహేంద్ర ఫిదా
దేశంలోనే తొలిసారిగా సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ ను అమరావతిలో ప్రారంభించటం, దానికి టెక్‌ మహీంద్రా భాగస్వామ్యం అవ్వటం పై, టెక్‌ మహీంద్రా సిఇఒ అభినందిస్తూ ట్వీట్ చేసారు.  దేశంలో సైబర్ భద్రతా గమ్యస్థానంగా అమరావతిని రూపొందించడానికి ఇదొక ప్రోత్సాహకరంగా నిలుస్తుందన్నారు.ప్రభుత్వ సెక్యూరిటీకి దన్నుగా ఎపిసిఎ్‌సఒసి నిలబడనుందని టెక్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ సిపి గుర్నానీ తెలిపారు. టెక్‌ఎంనెక్ట్స్‌ చార్టర్‌లో భాగంగా సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో అత్యుత్తమమైన సేవలను అందించేందుకు ఈ సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ దోహదపడనుందని గుర్నానీ తెలిపారు. అలాగే గుర్ననీ ఈ విషయం పై ట్వీట్ చేసారు కూడాసకల సదుపాయాలు, సరికొత్త టెక్నాలజీలతో కూడిన సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను ప్రారంభించారు సాంప్రదాయిక ఎస్‌ఔస్‌, ప్రెడిక్టివ్‌ థ్రెట్‌ అనలిటిక్స్‌ సామర్థ్యాలు, సెక్యూరిటీ కవరేజీ సదుపాయాలతో అన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు ఈ సెంటర్‌ సేవలందిస్తుందని టెక్‌ మహీంద్రా పేర్కొంది. డిజిటలైజేషన్‌కు మారుతున్న ప్రస్తుత తరుణంలో సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనలు అధికమవుతున్నాయని, ఇది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండే శాఖల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సైబర్‌ ముప్పు నుంచి రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఎపిసిఎ్‌సఒసిను ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.సైబర్‌ సెక్యూరిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో టెక్‌ మహీంద్రాకు ఉన్న అనుభవం, నైపుణ్యంతో భారత్‌లో తొలిసారిగా విజయవాడలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ సెంటర్ ద్వారా కంప్యూటర్స్ హ్యాకింగ్‌ను, వైరస్‌లను నియంత్రించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను ఎదుర్కోవడానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు, సంస్థలకు గూఢచార భాగస్వామ్య ముప్పును విశే్లషణ ద్వారా అందిస్తుందన్నారు. ఇలాంటి సెంటర్‌ను దేశంలో ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం-సామాజిక పరివర్తనాల్ని ప్రారంభించడంలో సహాయపడిన పలు సైబర్ ప్రోగ్రామ్‌లకు ఆంధ్రప్రదేశ్ నేతృత్వం వహిస్తుందని చెప్పారు.

Related Posts