YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బలమైన  నేతగా ఎదుగుతున్న పవన్

బలమైన  నేతగా ఎదుగుతున్న పవన్

బలమైన  నేతగా ఎదుగుతున్న పవన్
కాకినాడ, మార్చి 11,
చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అదృష్టవంతుడు అని చెప్పుకోవాలేమో. సినీ హీరోగా చిరంజీవి ఒక స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అలా మెగాస్టార్ అనిపించుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. అదే పవన్ కళ్యాణ్ సినీ హీరోగా ఎంట్రీవే కేరాఫ్ మెగాస్టార్ గా సూపర్ గా సాగిపోయింది. ఇక పవన్ కి అప్పటికే మెగా ఫ్యాన్స్ పెట్టుబడిగా ఉన్నారు. వారితో పాటు తనకూ కొత్త ఫ్యాన్స్ ని సృష్టించుకుని పవర్ స్టార్ అయిపోయారు.ఇక రాజకీయాల విషయనికి వస్తే చిరంజీవి కాని కాలంలో ప్రజారాజ్యం పెట్టి అభాసుపాలు అయ్యారు. ఆ తరువాత రాజకీయ ఓపిక వ్యూహాలు లేకుండా కాంగ్రెస్ లో పార్టీని కలిపేశారు. దాంతో ముఖ్యమంత్రి కావాల్సిన చిరంజీవి కేంద్రంలో ఒక సహాయ మంత్రిగా రెండేళ్ళు పనిచేసి రిటైర్ కావాల్సివచ్చింది. అదే పవన్ కళ్యాణ్ ని తీసుకుంటే ఏమీ కాని చోట కూడా ఆయన ఏడేళ్ళుగా రాజకీయ నేతగా వెలిగిపోతున్నారు. 2014లో పార్టీ పెట్టినపుడు ఒక్కడుగా వచ్చిన పవన్ కళ్యాణ్ అయిదేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీ, ఏపీలో టీడీపీ నుంచి రాచ మర్యాదలు అందుకుంటూ పొలిటికల్ చరిష్మాను నిండుగా అనుభవించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడినా కూడా పవన్ రాజకీయానికి ఎక్కడా బ్రేకులు లేకుండా కధ ముందుకు సాగిపోవడమే విచిత్రం.ఉమ్మడి ఏపీగా ఉండి ఉంటే ఈపాటికి పవన్ కళ్యాణ్ లాంటి పార్టీలన్నీ చాప చుట్టేయాల్సిందే. విభజన ఏపీ కాబట్టి రాజకీయంగా బాగా స్పేస్ దొరుకుతోంది. దానికి తోడు కొత్త రాష్ట్రం కావడంతో అష్ట కష్టాలు ఏపీని చుట్టుముట్టి ఉన్నాయి. ఎంతో అనుభవశాలి అనుకున్న చంద్రబాబునే విభజన పాపాలూ శాపాలు నిండా ముంచేశాయి. ఇపుడు జగన్ వల్ల కూడా ఏపీ స్టీరింగ్ తిప్పడం కావడంలేదు. బహుశా ఇదే పవన్ కళ్యాణ్ పార్టీని పదిలంగా ఉంచుతోంది అనుకోవాలి. జనాలు టీడీపీని వైసీపీకి చూసేశారు. తనకూ ఒక చాన్స్ ఇస్తారు అన్న నమ్మకమే పవన్ పార్టీని అలా నిలబెట్టేస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికి బాగానే రాజకీయం నేర్చేశారు. కొన్ని పార్టీలతో తాను జట్టు కట్టారు, మరి కొన్ని పార్టీలు తనతో జట్టు కట్టాయి. ఇలా ఏపీలో రాజకీయం మాత్రం పవన్ కి బాగానే అర్ధమైపోయింది. కుల రాజకీయాలతో నిండిన ఏపీలో పవన్ కూడా కాపు కార్డు తీశారు. ఈ మధ్య ఆయన మాజీ మంత్రి సీనియర్ నేత చేగొండి హరి రామజోగయ్యతో పాటు కాపు పెద్దలతో పెట్టిన మీటింగ్ ఫలితాలు ఫ్రెష్ గా పంచాయతీ ఎన్నికల్లో కనిపించాయి. గోదావరి జిల్లాలో జనసేన బాగానే ఉనికి చాటుకుంది. ఇదే ఊపులో స్థానిక ఎన్నికల్లో కూడా కాపుల అండతో దూసుకుపోతే చాలు సార్వత్రిక ఎన్నికల నాటికి కొంతైనా రాజకీయ పునాది ఏర్పడుతుంది అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారుట. పవన్ ఇచ్చిన పిలుపుని అందుకుని కాపులు జనసేనకు టర్న్ అయిన సన్నివేశం ఏపీ రాజకీయాల్లో ఇపుడు కనిపిస్తోంది. ఇక వారిని అట్టిపెట్టుకుని పవన్ చేయాల్సిన రాజకీయ మంత్రాంగం చేసుకుంటే 2024 ఎన్నికల‌ నాటికి ఏపీలో ఒక బలమైన ఫోర్స్ గా తయారవుతారు అని రాజకీయ మేధావుల నుంచి వినిపిస్తున్న మాట. మొత్తానికి పవన్ ఇష్టం లేకుండా సినీ హీరో అయ్యాడు. పెద్దగా కష్టపడకుండా రాజకీయాల్లోనూ హీరోగా అవుతున్నాడు అనుకోవాలేమో.

Related Posts