YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

అన్నపూర్ణగా మారుతున్న తెలంగాణ 

అన్నపూర్ణగా మారుతున్న తెలంగాణ 

అన్నపూర్ణగా మారుతున్న తెలంగాణ 

హైదరాబాద్, మార్చి 11, 

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పంటల దిగుబడి పెరిగాయి. ఈ ఏడాది వర్షాకాలం (ఖరీఫ్ సీజన్), యాసంగి (రబీ) సీజన్లతో కలిపి తెలంగాణలో 2.50 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రబీ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో దిగుబడి కూడా అదే స్థాయిలో నమోదు కానున్నట్లు అంచనా. కాగా, వరి, పత్తి దిగుబడి కొంతమేర నిరాశ పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది పత్తి దిగుబడి కొంత నిరాశే మిగిల్చేలా కనిపిస్తోంది. దాదాపు 60.54 లక్షల ఎకరాల్లో వేసిన పత్తి దిగుబడి 42.05 లక్షల టన్నులకే పరిమితం కానుంది. గతేడాది ఇదే పత్తి పంటను 52.55 లక్షల ఎకరాల్లో వేసినప్పుడు 68.58 లక్షల దిగుబడి వచ్చింది. ఈ సారి సాగు విస్తీర్ణం పెంచినా.. దిగుబడి సుమారు 26 లక్షల టన్నులు తగ్గింది.దేశవ్యాప్తంగా ఈ ఏడాది కంది పంట దిగుబడి కూడా తగ్గిందనే చెప్పుకోవచ్చు. దేశంలో 48.20 లక్షల టన్నుల దిగుబడి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అధిక వర్షాలు, వివిధ రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం తగ్గడంతో 38.80 లక్షల టన్నులకు మించి పంట పండలేదు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎన్నడూ లేని విధంగా 4.17 లక్షల టన్నుల కందులు దిగుబడి వచ్చింది. గతేడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట వద్దని.. కంది పంటను వేయాలని పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 10.86 లక్షల ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు.2020-21లో రెండు సీజన్లతో కలిపి వరి ఒక కోటీ 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. రెండు సీజన్లు కలిపి 40.72 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు చేయగా.. 153 శాతం అదనపు విస్తీర్ణం పెరిగింది. దీంతో ఒక కొత్త రికార్డు నమోదైంది. సాగు విస్తీర్ణం పెరగడంతో ధాన్యం దిగుబడి కూడా పెరగనుంది. దేశవ్యాప్తంగా 2020-21 నాటికి పంటల దిగుబడి ఈ క్రింది విధంగా ఉన్నాయి. బియ్యం 1,203 లక్షల టన్నులు, గోధుమలు 1,092 లక్షల టన్నులు, మొక్కజొన్న 301 లక్షల టన్నులు, పప్పు ధాన్యాలు 244 లక్షల టన్నులు, నూనెగింజలు 373 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.

Related Posts