YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

అన్నమయ్య కోసం పోస్టు క్రియేట్ చేశారు తిరుమల

అన్నమయ్య కోసం పోస్టు క్రియేట్ చేశారు తిరుమల
రెండు వారాల కిందట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గడ్డం తీశారు. శ్రీనివాసుడికి సమర్పించుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని మొక్కుకున్నట్లు రాఘవేంద్రరావు చెప్పారు. అసలు సంగతి వేరే ఉందనే ప్రచారం వచ్చింది. టీటీడీ ఛైర్మన్ పదవి ఆయన దక్కనుందనే కథనాలు వచ్చాయి.ఎస్వీబీసీకి చైర్మన్‌ పోస్టు లేదు. కానీ ఆయన కోసమే క్రియేట్ చేశారు చంద్రబాబు. కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కార్యక్రమాల రూపకల్పన, పర్వదినాల్లో విశిష్ట కార్యక్రమాలు ప్రసారం చేయడం వంటి పనులను ఇప్పుడు చేయనున్నారు రాఘవేంద్రరావు. ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ జరిగింది. అమెరికా వంటి దేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అన్నమయ్య రచించిన వేల సంకీర్తనల్లో కొన్నే ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరికొన్ని పాటలను వెలుగులోకి తీసుకురానున్నారు. అభిషేకం, తోమాల, అర్చన, సుప్రభాతం, సహస్రకళాశాభిషేకం, అష్టదళ పాద పద్మారాధన వంటి సేవలను దగ్గరుంచి చూసే భాగ్యం అందరికీ అందేలా చేయనుంది టీటీడీ. అందుకే అలాంటి సమయంలో తాను అక్కడకు వెళ్లడం తన పూర్వ జన్మ సుకృతం అంటున్నారు రాఘవేంద్రరావు. ఆర్జిత సేవలను నమూనా ఆలయాల్లో చిత్రీకరించి ప్రసారం చేయడం ద్వారా అనేక రకాలుగా ప్రశంసులు దక్కనున్నాయి. పదవి కోసం ఎదురు చూడకుండా పని చేసుకుంటూ పోతే కచ్చితంగా పాలకులు గుర్తిస్తారు. అదే ఇప్పుడు రాఘవేంద్రరావుకు వరమైంది.  తీరా ఆయనకు బదులు సుధాకర్ యాదవ్ కు ఇచ్చారు. అయినా సరే రాఘవేంద్రరావు తాను అనుకుంది సాధిస్తేనే సాధారణంగా గడ్డం తీస్తారు. అలా తీశారంటే బలమైన కారణం ఉంటుందని అంతా అనుకున్నారు. చివరకు అదే నిజమైంది. రాఘవేంద్రరావు కోసం ప్రత్యేకంగా ఒక పోస్ట్ ను క్రియేట్ చేశారు. అదే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి. అంతే ఇక చానల్ అనేక రకాలుగా పురోగతి చెందడం ఖాయమంటున్నారు. డబ్బులకు లోటు లేదు. అదే సమయంలో ఉద్యోగుల సమస్యలను ఆయన పరిష్కరిస్తారనే ప్రచారం సాగుతోంది. 
కాయలు, పండ్లతో రాఘవేంద్రరావుకు ఉన్న అనుబందం వేరు. తన పాటల్లో ఆయన చూపించినట్లు మరో దర్శకుడు చూపించలేరు. తెలుగు సినిమాల్లో అద్భుతాలు సృష్టించారు దర్శకేంద్రుడు. ఆధ్యాత్మికత ఉప్పొంగేలా భక్తి సినిమాలనూ రూపొందించారు. అందుకే ఆయన సేవలకు మెచ్చి సిఎం చంద్రబాబు నాయుడు బరువైన కిరీటం బహుకరించారు. భక్తికి బహుళ ప్రజాదరణ కల్పించిన దర్శకేంద్రుడి ప్రతిభకు తాజా గుర్తింపు లభించింది. కొత్త బాధ్యతలతో శ్రీవేంకటేశ్వరుని వైభవాన్ని ప్రపంచం నలుచెరగులా చాటుతానంటున్నారు. అన్నమయ్య సినిమా తీసిన తర్వాత రాఘవేంద్రరావు ఖ్యాతి ఆద్యాత్మికత వైపు మళ్లింది. గతంలో టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా సేవలందించిన ఆయన ఇప్పుడు ఒక ప్రధాన పదవిని నిర్వరించనున్నారు. ఎస్వీబీసీ  చైర్మన్‌గా సేవచేసే అవకాశం కల్పించడం మాములు విషయం కాదు. 

Related Posts