YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉగాది రోజున వాలంటీర్లకు అవార్డులు

ఉగాది రోజున వాలంటీర్లకు అవార్డులు

ఉగాది రోజున వాలంటీర్లకు అవార్డులు
విజయవాడ, మార్చి 11,
ఏపీలో ఉగాది రోజున గ్రామ,వార్డ్ వాలంటీర్ల సేవలకు జగన్ సర్కార్ అవార్డులు అందజేయనుంది. మూడు కేటగిరీల్లో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులతో గౌరవించనున్నారు. ఈ సత్కార కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వాలంటీర్లకు ఇచ్చే ప్రసంశా పత్రం, మెడల్, బ్యాడ్జి, శాలువాలను పరిశీలించారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఇంకా ఏమి చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.సేవలకు గుర్తింపుగా మూడు కేటగిరీల్లో మొత్తం 2,22,900 మంది గ్రామ, వార్డు వాలంటీర్లను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించారు. ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజవర్గంలో వాలంటీర్లకు అవార్డులు, సత్కార కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని రోజుల ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు.రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో తాను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. వచ్చే నెల 13న ఉగాది రోజున రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారుమొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు, రివార్డులు అందజేయనున్నారు. మొదటి కేటగిరీలో 2,18,115 మంది వాలంటీర్లకు ‘సేవా మిత్ర’ అవార్డు అందజేస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించినవారికి అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరికి రూ.10 వేలు నగదు, ప్రసంశా పత్రం, శాలువా, బ్యాడ్జితో సత్కరించనున్నారు.రెండో కేటగిరీలో 4000 మంది వాలంటీర్లకు ‘సేవా రత్న’అవార్డు ఇస్తారు. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతి మండలంలో ఐదుగురు చొప్పున, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున, కార్పొరేషన్లలో పది మంది చొప్పున మొత్తం 4,000 మంది వాలంటీర్లను ‘సేవా రత్న’ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీరికి రూ.20 వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు.మూడో కేటగిరీలో 875 మంది వాలంటీర్లకు ‘సేవా వజ్ర’అవార్డు ఇస్తారు. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు.

Related Posts