శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివనామస్మరణతో మారు మ్రోగుతున్న శివాలయాలు...
విజయవాడ మార్చి 11,
కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని పెదకల్లెపల్లి గ్రామంలో స్వయంభూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త రంగులతో విద్యుద్దీపాలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకము దేవాలయ వేద పండితులు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జి.వి.డి.ఎన్. లీలా కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్ సర్వీస్ లను ఏర్పాటు చేశారు. అవనిగడ్డ డి.ఎస్.పి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.