మహాశివరాత్రి శుభాకాంక్షలు తెల్పిన మంత్రి వెలంపల్లి
విజయవాడ మార్చి 11,
మహా శివరాత్రిని పురస్కరించుకుని ప్రజలకు శుభం కలగాలని, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదులు దక్కాలని కోరుకుంటూ పాతశివాలయంలో ఈశ్వరుడుని దర్శించుకొని పూజలు నిర్వహించిన్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారన్నారు. తొలుత శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానములో స్వామి వారిని, పాత శివాలయం ఈ శ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దినవాహిని సత్రం వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్ని పేదలకు అన్నదానం చేశారు