YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఏడుపాయల కన్వెన్షన్ సెంటర్

ఏడుపాయల కన్వెన్షన్ సెంటర్

ఏడుపాయల కన్వెన్షన్ సెంటర్

మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి కొత్తగూడెం మార్చి 11, (న్యూస్ పల్స్)

ఏడుపాయల దుర్గ భవాని అమ్మవారి కి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక ఏడుపాయల ఉత్సవాలు దినదినాభివృద్ది జరుగుతున్నాయి. జాతర కోసం సింగూరు నుంచి 0.35 టీఎంసీ ల నీళ్లు విడుదల చేశాం. పోతం శెట్టిపల్లి నుంచి రూ 36 కోట్లతో 100 ఫీట్ల రోడ్డును అందుబాటులోకి తెస్తాం. అమ్మవారి దయతో ఈ ప్రాంతం సుబిక్షమవుతుంది. కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నాం. కోటి ఎకరాల పంట సాగుఅవుతోంది. దేశంలోనే కోటి ఎకరాలు సాగుచేసి మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సీఎం కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఏడుపాయల్లో పోలీస్ అవుట్ పోస్ట్, ఏటీఎం లను ఏర్పాటు చేశారని అన్నారు.

రూర్బన్ పథకం నుంచి ఏడుపాయలల్లో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్సవాలు అంతంత మాత్రంగానే జరిగేవని అయన అన్నారు.

Related Posts