శివునికి త్రిశూలం ముఖ్య ఆయుధం త్రిశూలానికి మూడు కొనలుండి అడుగున వాటిని కలుపుతూ శూలహస్తం ఉంటుంది.
మూడు కొనలు సత్వ, రజస్, తమో గుణాలను సూచిస్తే ఆ శూలహస్తం వాటి ఏకత్వాన్ని.సూచిస్తుంది. ఇక్కడ త్రిగుణాల ఏకత్వం అంటే వాటికి అతీతమైన తత్త్వం అని అర్థం. అంతేకాకుండా ఇడ, పింగళ, సుషుమ్ననాడులు మూడూ శిరస్సులోని జ్ఞాన కేంద్రం దగ్గర కలుస్తాయి. దీన్నే త్రివేణి సంగమం అంటారు. ఆ మూడు నాడులు మూడు కొనలని సూచిస్తే జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని.. వాటి ఏకత్వం త్రిగుణ సంగమాన్ని సూచిస్తుంది. ఆకాశం శబ్ద గుణంతో కూడుకొని ఉంది. ఆకాశంలో ధ్వనుల ప్రకంపనలు ప్రయాణం చేస్తుంటాయి. మనం పవిత్ర మైన మంత్రాలను శ్రద్ధాసక్తులతో చదివేటప్పుడు కాని, వినేటప్పుడు కాని వాటినుండి మధురమైన ఢమరుక నాదం వినిపిస్తుంది. యోగులకు ఇది మహదానందాన్ని కలిగిస్తుంది.
దీన్ని సూచిస్తూ శివుని త్రిశూలానికి ఢమరుకం కట్టి ఉంటుంది.
సర్పిలాకారంలో ఉండే కుండలినీశక్తిని సూచిస్తూ శివుడు సర్పాలను మెడలో ధరిస్తారు. అందుకే నాగాభరణుడు అనే పేరు ఉంది. ఈ కుండలినీ శక్తి విజృభించినపుడు అష్ట సిద్ధులు కలుగుతాయి. ఈ అష్టసిద్ధులు శివుని నియంత్రణలో ఉండటం వల్ల, వారు అష్టసిద్ధులకు ప్రభువు అవడం