YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్లైమాక్స్ కు ఏపీ రాజకీయాలు

క్లైమాక్స్ కు ఏపీ రాజకీయాలు

విజయవాడ, మార్చి 13, 
ఏపీలో రాజకీయం క్లైమాక్స్ కి చేరుకుంది. అందుకే స్థానిక ఎన్నికల కంటే ముందే రాజకీయ కాక పెద్ద ఎత్తున రేగింది. ఆ మాటకు వస్తే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విపక్షాలు ఏదో విధంగా రగడ చేస్తూనే ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రికైనా కూడా కనీసం ఆరు నెలల పాటు టైమ్ ఇచ్చి ఆయన పాలన తీరుని చూస్తారు. జగన్ విషయంలో మాత్రం అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. మే 30న జగన్ సీఎం గా ప్రమాణం చేస్తే ఆ వెంటనే ఇసుక సత్యాగ్రహం అంటూ చంద్రబాబు ఉద్యమించారు. ఇక జనసేన పవన్ కళ్యాణ్ అయితే అదే ఏడాది సెప్టెంబర్ లో విశాఖలో లాంగ్ మార్చ్ అంటూ పోరాటానికి దిగిపోయారు.నిజానికి రాజకీయాలు నిరంతర ప్రవాహం. గెలుపు పోటములు అత్యంత సహజం. ఎన్నో పార్టీలు రేసులో ఉంటాయి. గెలిచేది మాత్రం ఒక్కటే పార్టీ. అందువల్ల మిగిలిన పార్టీలు ప్రజాభిమానాన్ని చూరగొనేలా వ్యవహరించాలి. అంతే కాదు, ప్రజలకు కూడా ఆలోచించుకునే సమయం ఇవ్వాలి. తమ చేతల ద్వారానే దగ్గర కావాలి. కానీ ఇపుడు షార్ట్ కట్ మెదడ్ ఏంటి అంటే అధికారంలో ఉన్న పార్టీని తిట్టడం. ఈ నయా పాలిటిక్స్ ని అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి. ఇక ఏపీలో అయితే జగన్ ఎక్కడ పాతుకుపోతాడో అన్న టెన్షన్ తెలుగుదేశానికి జనసేనకు కూడా ఉన్నాయని అంటారు.ఏపీలో జగన్ మరో సారి అధికారంలోకి కనుక వస్తే మిగిలిన పార్టీలకు ఖేల్ ఖతం అయినట్లే. ఇప్పటికే తనకంటూ ఓటు బ్యాంక్ ని బాగా బలోపేతం చేసుకుంటున్న జగన్ రానున్న కాలంలో మళ్ళీ అత్యధిక శాతం ఓట్లూ సీట్లూ సాధించి సీఎం కావడానికి అంతా రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పటికే జగన్ తో ఒంటరిగా పోరాడి గెలవడం కష్టమన్న భావన అన్ని పార్టీల్లో ఉంది. దానికి తోడు అటు టీడీపీకి, ఇటు జనసేనకు 2024లో అవే చివరి ఎన్నికలు అవుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఆ రెండు పార్టీలకు ఉందన్న మాట.
మధ్య పవన్ కళ్యాణ్ కాపు నేతలతో సమావేశం నిర్వహించి జనసేనకు మద్దతు కూడగట్టారు. ఆ సమావేశంలో వచ్చిన ప్రస్థావన కూడా కాపుల కోసం ఉన్న ఏకైక పార్టీ జనసేను నిలబెట్టుకోవాలనిట. ఒక రకంగా 2024 ఎన్నికల్లో కాపులంతా పోలరైజ్ అయి జనసేనకు ఓటు వేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారట. అప్పటికి కనుక జనసేన గట్టిగా నిలబడకపోతే జగనే మరోసారి గెలిస్తే ఇక ఖేల్ ఖతం అన్న చర్చ కూడా వచ్చిందట. ఇక టీడీపీ పరిస్థితి కూడా అంతే. చంద్రబాబుకు ఇప్పటికే వయసు మీద పడింది. లోకేష్ పగ్గాలు అందుకోలేకపోతున్నాడు. 2024 నాటికి టీడీపీని గెలిపించుకోకపోతే ఏపీలో మిగిలేది ఒకే ఒక ప్రాంతీయ పార్టీగా వైసీపీ మాత్రమే అంటున్నారు. దాంతో జమిలి ఎన్నికలు వచ్చినా షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు జరిగినా కూడా లాస్ట్ చాన్స్ అంటూ ఈ రెండు పార్టీలు మొత్తానికి మొత్తం ఊపిరిని పెట్టి ఏ ఎన్నిక అయినా కూడా పోరాటం చేస్తాయని అంటున్నారు.

Related Posts