YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వ్యూహాలను మారుస్తూ... ఎప్పటికప్పుడు

వ్యూహాలను మారుస్తూ... ఎప్పటికప్పుడు

విజయవాడ, మార్చి 13, 
అధికారమే అసలైన ఆభరణం. అదే పదునైన ఆయుధం కూడా. లేకపోతే శోభ తగ్గిపోతుంది. కళా విహీనం అవుతుంది. ఈ సంగతి అందరి కంటే కూడా రాజకీయ జీవులకు బాగా తెలుసు. అందుకే వారు పదవుల కోసం వెంపర్లాడతారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికీ అవి శాశ్వతం కాదు. కుర్చీలాటలో ఒక్కోసారి కిందకు దిగిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అలాంటిదే. ఆయన రెండేళ్ళు కూడా గట్టిగా గడవకముందే ఎంతటి వారు ఎలా అయ్యారు అన్న చర్చ అంతటా సాగుతోంది.చంద్రబాబు తెల్లారిలేస్తే గొంతు బాగానే చించుకుంటున్నారు. జగన్ మీద ఉన్నవీ లేనివీ కలిపి నానా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. అటు నుంచి ఒక్క విమర్శ వచ్చినా చంద్రబాబుకు పొలిటికల్ వాల్యూ పెరిగేది, మైలేజ్ కూడా దక్కేది.. కానీ ఇక్కడే జగన్ తనదైన వ్యూహం అనుసరిస్తున్నారు. చంద్రబాబు కానీ ఆయన పుత్ర రత్నం కానీ అరచి గోల పెట్టినా తాను అసలు పట్టించుకోవడంలేదు. లైట్ గా తీసుకుంటున్నారు. పైగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డితో జవాబు చెప్పిస్తున్నారు.ఎవరీ సజ్జల. ఆయన ఒక మామూలు సలహాదారుడు, ఆయన మాకు సవాళ్ళు చేయడమేంటి, మేము సమాధానం చెప్పడమేంటి అని లోకేష్ బాబు ఈ మధ్య తెగ ఆవేశపడిపోయాడు. జగన్ మాకు సమాధానం చెప్పాలంటూ గట్టిగానే మీడియా ముందుకు వచ్చి నిలదీస్తున్నారు. మరి జగన్ ఎందుకు వస్తారు, తండ్రీ కొడుకులు తెల్లారి చేసే అనేక విమర్శలను ఒక్కోదానికి ఎందుకు సమాధానం చెబుతారు. పైగా జగన్ ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబుని, లోకేష్ ని సజ్జలతో సమరం చేసుకోమ్మని వదిలేశారు. అంటే ఇక్కడ జగన్ తన స్థాయి వేరు అని చెప్పకనే చెప్పేశారు అన్న మాట. అదే ఇపుడు టీడీపీ అధినాయకులకు మండుకువస్తోందిట.చంద్రబాబు లోకేష్ తమ వ్యూహాలను కూడా మార్చారు. ఏకంగా జగన్ని టార్గెట్ చేసుకుని ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. జగన్ వట్టి పిరికివాడు అంటున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ వదిలి రావడానికి ధైర్యం అసలు లేదు అంటూ నిందిస్తున్నారు. పోలీసులను పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో గెలిచారంటూ తప్పుపడుతున్నారు. అదీ ఒక గెలుపేనా అంటూ తగులుకుంటున్నారు. ఎన్ని మాటలు అన్నా కూడా జగన్ నోటి వెంట ఒక్క మాట మాత్రం తెప్పించలేక అలసిపోతున్నారు. తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబుని జగన్ ఇలా మానసికంగానే దెబ్బ తీస్తున్నారు అన్న మాట కూడా ఉంది. మొత్తానికి జగన్ టీడీపీని, ఇద్దరు బాబులనూ అసలు పట్టించుకోకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాక ఎంత రచ్చ చేసినా ఏమి లాభం. జనంలో తేలిక అయిపోవడం తప్ప అన్న మాట తమ్ముళ్ళ నుంచే వస్తోంది.

Related Posts