YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోలుకోలేని బీజేపీ....

కోలుకోలేని బీజేపీ....

విజయవాడ, మార్చి 13, 
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అత్యంత దయనీయమైన పార్టీ ఏదైనా ఉందా? అంటే అది బీజేపీ అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎటు చూసినా బీజేపీ కోలుకేలేదు. కోలుకోదు కూడా ఇది కన్ఫర్మ్. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు రాష్ట్రానికి ఏడేళ్లుగా బీజేపీ చేస్తున్న అన్యాయాలే ఇందుకు కారణంగా చెప్పుకోక తప్పదు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయవేటీక రించాలన్న ప్రతిపాదనతో బీజేపీ పూర్తిగా ఏపీలో కనుమరుగవుతుందని చెప్పక తప్పదు.రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చాల్సింది పోగా, ఉన్న వాటిని తొలగించడం బీజేపీపై ఆగ్రహానికి కారణం. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం ప్రస్తుతం బీజేపీలో ఉన్న కొందరు నేతలకు సాకుగా దొరికిందంటున్నారు. వారంతా తిరిగి తమ సొంత గూటికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికిప్పడు కాకపోయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను కారణంగా చూపి నేతలు టీడీపీలోకి తిరిగి వచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది.2019 లో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే అనేక మంది టీడీపీ నేతలు బీజేపీ లో చేరిపోయారు. వైసీపీలో చేరడం ఇష్టంలేక వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఆశ్రయించారు. అక్కడ ఉన్నా లేనట్లుగానే ఉంటున్నారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, మాజీ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తదితరులు తమను కాపాడుకునేందుకు బీజేపీ లో చేరిపోయారు.ఇక ఎన్నికల సమయం దగ్గరపడింది. జమిలి ఎన్నికలు వస్తే 2022లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. బీజేపీలో ఉండి చేసేదేమీ ఉండదు. అందుకే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో చేరి తమ సీట్లను కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కారణంగా చూపి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు బీజేపీని డ్యామేజీ చేయకుండా, కేవలం కారణం చూపి ఆ పార్టీ నుంచి బయటపడాలని చూస్తున్నారట. మొత్తం మీద సాకు దొరికింది. ఇక సర్దుకోవడమే తరువాయి.

Related Posts