హైదరాబాద్, మార్చి 13,
పార్టీల పేర్లు మార్చొచ్చా.. లేదా అనే విషయం పక్కన పెడితే.. మార్చితే మాత్రం.. కేసీఆర్ ఏపీలోకి అడుగు పెడితే మాత్రం పొలిటికల్ గా ఎంతో కొంత బెన్ ఫిట్ ఉంటుంది అనే టాక్ ఫుల్ గా నడుస్తోంది. అర్రే.. ఏంట్రా భయ్.. తెలంగాణ రాష్ట్ర సమతి అనే పేరు పెట్టి.. పార్టీని విస్తరించకుండా చేశామా అనే ఫీల్ లో టీఆర్ఎస్ టీమ్ ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిని.. తెలుగు రాష్ట్ర సమతిగా చేస్తే.. ఎలా ఉంటుంది అనే టాక్ అయితే నడుస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ హాట్ టాపిక్స్ లో.. విశాఖ ఉక్కు కూడా ఒకటి. విశాఖ ఉక్కుపై పోరాడుతున్న వారు.. మాకు కేసీఆర్ సపోర్ట్ కావాలి.మా తరపున కేసీఆర్ కూడా పోరాడాలి అనే వాణి వినిపిస్తున్నారు. ఇక ఇటు నుంచి కూడా మంచి రెస్పాన్సే ఉంది. టైం చూసి.. కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అన్నారు. వారికి మా సపోర్ట్ ఉంటుంది అన్నారు. కేసీఆర్ ని అడిగి అవసరం అయితే.. ప్రత్యక్ష పోరాటానికి కూడా వస్తాం అన్నారు. దీంతో.. ఏపీ ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వారి సమస్యపై రెస్పాండ్ కావడంతో.. కేటీఆర్ ఫోటోకి పాలాభిషేకాలు గట్రా చేశారు. ధన్యవాదాలు తెలిపారు.ఇదంతా చూస్తుంటే.. కేసీఆర్ కి ఉద్యమ లీడర్ గా ఉన్న పేరు ఇంకా పోలేదు అనిపిస్తోంది. మొన్న మొన్నటి వరకూ అదే స్పూర్తి రగిలించారు కదా. కేంద్రం పై యుద్ధం చేస్తాం అంటూ.. రైతుల ఉద్యమానికి సపోర్ట్ ఇస్తున్నప్పుడు పాత కేసీఆర్ కనిపించారు. పాత టీఆర్ఎస్ కనిపించింది. కానీ.. సడన్ గా యూటర్న్ తీసుకుని పాలిటిక్స్ అంటే ఏంటో చూపిస్తూ ట్విస్ట్ ఇచ్చారు కేసీఆర్. సో.. అంతా మారిపోయింది. అయినా సరే.. పాత పేరు పాత పేరే కదా.
కేసీఆర్ అంటే ఉద్యమ లీడర్ అంతే. అందుకే.. ఇప్పటికీ ఆ రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు కానీ.. ఏపీలో కేసీఆర్ టీఆర్ఎస్ ని విస్తరిస్తే.. కాంగ్రెస్, బీజేపీ, జనసేనల కంటే ఎక్కువ సీట్లు రావడం గ్యారంటీ. అందుకే.. ఆ విషయాలు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికైనా సీట్లు వస్తుంటే ఎందుకు వదులుకుంటారు చెప్పండి. ఎలాగూ.. రమ్మనకుండానే వచ్చి రాజకీయాలు చేస్తున్నారు షర్మిల. వద్దన్నా ఆగడం లేదు. మరి రా రమ్మని పిలుస్తున్న కేసీఆర్ మాత్రం ఎందుకు ఆగుతారు. అందుకే.. కేటీఆర్ రెస్పాండ్ అయినట్లు కనిపిస్తోంది. ఎలాగూ ఎంఐఎం ఎంట్రీ ఇచ్చింది.. ఇక ఆయన దోస్త్ అయిన.. కేసీఆర్ కూడా ఎంట్రీ ఇస్తారనే టాక్ అయితే ఉంది.