గౌహాతి, మార్చి 13,
న్ని చోట్లా ఇతర పార్టీల నేతలను తన పార్టీలోకి చేర్చుకోవడమే బీజేపీకి తెలుసు. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుని వైరి పక్షాన్ని బలహీనం చేయాలన్నది బీజేపీ ప్లాన్. ఇప్పటివరకూ పశ్చిమ బెంగాల్ తో సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇదే విధానాన్ని అనుసరించింది. కానీ అసోంలో మాత్రం దీనికి రివర్స్ లో జరుగుతుంది. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో అసోం ఒక్కటే బీజేపీకి గెలుస్తామన్న నమ్మకం గట్టిగా మొన్నటి వరకూ ఉండేది.కానీ రాను రాను అసోంలో కూడా బీజేపీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. 64 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. గత ఎన్నికల్లో 86 స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకుని అధికారంలోకి రాగలిగింది. అయితే అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ నేతృత్వంలో ఐదేళ్ల పాటు సాగిన పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా లేరు. మరోసారి అధికారంలోకి రావాలన్న బీజేపీకి సోనోవాల్ పాలన కూడా దెబ్బతీస్తుందంటున్నారు.ఇక అసోంలో కాంగ్రెస్ కూటమి రోజురోజుకూ బలం పెంచుకుంటుంది. కాంగ్రెస్ తో పాటు ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. అందుకే బీజేపీ లబ్దిపొందగలిగింది. కానీ ఈసారి కాంగ్రెస్, ఏఏయుడీఎఫ్ ల కూటమి పోటీ చేస్తుండటంతో అసోంలో బీజేపీ పప్పుులు ఉడకటం కష్టమేనని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.దీంతో పాటు అసోంలో మరో రెండు కొత్త ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. రాయిజోరి దళ్, అసోం జాతీయ పరిషత్ వంటి పార్టీలు అసోం గణపరిషత్ కు నష్టం చేకూరుస్తాయంటున్నారు. బీజేపీ రోజురోజుకూ బలహీనపడుతుండటంతో బీజేపీ మిత్ర పక్షాలు సయితం హ్యాండ్ ఇస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షం బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీజేపీకి తలాక్ చెప్పేసింది. తాము కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించింది. దీంతో అసలే అసోంలో అంతంతమాత్రంగా ఉన్న బీజేపీ ఆశలు మరింత అడుగంటాయి.