ప్రైవేటీకరణ అన్యాయం
మాజీ మంత్రి గంటా
తిరుమల మార్చి 13,
తెలుగు వారి గుండె చప్పుడు విశాఖ ఉక్కు హక్కు. కోటా కిందా కాదు త్యాగాలతో వచ్చినది ఉక్కు ప్యాక్టరీ. నష్టాలు వస్తున్నాయని ప్యాక్టరీని ప్రయివేటుకరణ చేయడం అన్యాయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం నాకు అన్ని ఇచ్చింది. అన్ని ఇచ్చిన విశాఖ తల్లి కొసము పదవికి రాజీనామా చేసాను. రాజీనామ ను కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. స్పీకర్ పార్మెట్ లో రాజీనామా చేసాను. విశాఖ ఉక్కు ప్యాక్టరీ ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా అదికార,ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి.. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఇది చిన్న విషయమని అన్నారు. ఇది చిన్న విషయం కాదు పక్కా ప్లాన్ తో కేంద్రము ప్రయివేటీకరణ కొసము ముందుకు పోతుందని అయన అన్నారు. పోస్క్ సంస్థ తో ఒప్పందము,రాష్ట ప్రభుత్వాన్ని కలవడం జరిగిందని కేంద్ర మంత్రులు రాజ్యసభ లో ప్రకటించారు. ఇప్పటికైనా బిజెపి నాయకులు కళ్లు తెరవాలని అయన అన్నారు. తెలంగాణ మంత్రి కేటిఅర్, చిరంజీవి, సుబ్రహ్మణ్య స్వామి విశాఖ హక్కు ఉద్యమానికి మద్దతు పలికారు. త్వరలో దక్షిణ భారత ఉద్యమంగా మారనుంది. పార్లమెంట్ లో మంత్రి ఠాకూర్ అమ్ముడు పోక పోతే మూసి వేస్తామంటు భాద్యత రాహిత్యంగా మాట్లాడారు. ప్రవేటీకరణ అపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికే ఉంది. ప్రతిపక్షాలు పోరాటం మాత్రమే చేస్తాయని అయన అన్నారు. రాజీనామాల విషయంలో అధికార పార్టీ నాయకులు ద్వంద వైఖరి అవలంబిస్తున్నారు. గతంలో ప్రత్యేక హోదా కొసము రాజీనామాలు అవసరమన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ మౌనాన్ని విడాల్సిన అవసరం ఉందని అయనఅన్నారు.