YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేపు టీఆర్ఎస్ ప్లీనరీ

రేపు టీఆర్ఎస్ ప్లీనరీ

కేసీఆర్‌ సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమాన్ని తీరానికి చేర్చటంలో సఫలీకృతమయ్యారు. 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించటమేకాక, ఒంటి చేత్తో టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చారు. నూతన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం, బీజేపీ – కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో పీపుల్స్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది నడుస్తున్న చరిత్ర. ఈ రెండు ఉదంతాలు టీఆర్‌ఎస్‌ ఉత్థానపతనాలను కళ్లకు కడుతాయి. ఈ సంఘటనకు ఐదేళ్లు ముందుగా 2009 ఎన్నికల్లో పరాజయం.. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ చొరవ తీసుకొని సర్దిచెప్పటం వల్ల కేసీఆర్‌ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇది తొమ్మిదేళ్ల కిందటి ముచ్చట.
ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అనుభవిస్తున్న రాజకీయ, అధికార వైభోగమే అందరికీ కనిపిస్తున్నది. 2001లో పురుడుపోసుకున్న ఆ పార్టీకి చెందిన 17 ఏళ్ల ప్రస్థానంలో వైభోగం వయసు నిండా నాలుగేళ్లు కూడా లేదు. అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీని నడిపించటానికి, ఉద్యమాన్ని సజీవంగా ఉంచటానికి, లక్ష్యం వైపు దూకించటానికి పడినటువంటి బాధల బాకీ తీర్చటం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఆశయంతో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించే నాటికి ఆయన వద్ద ఉన్న ఆర్థిక వనరులు చాలా పరిమితం. ఆ రోజుల్లో కాన్వాయ్‌ బయటి తీస్తే లక్ష రూపాయల పైమాటే. భారీ బహిరంగ సభ నిర్వహణను పూనుకుంటే కోట్ల రూపాయల వ్యవహారం.తెలంగాణ ఉద్యమ చరిత్రను వర్ణించాలంటే.. మరొక ఉద్యమంతో పోల్చాలంటే మళ్లీ తెలంగాణ ఉద్యమమే దానికి సరితూగుతుంది. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు ప్రజల్లో చైతన్యం రగిల్చి ఉండవచ్చు. ఒక్కో ఉద్యమం ఒక్కో ప్రజాస్వామిక లక్షణాన్ని, దృక్పథాన్ని ప్రపంచానికి అందించి ఉండొచ్చు. కానీ.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అహింసాయుత పోరాటాల్లో తెలంగాణ సాధన ఉద్యమం అగ్రభాగాన ఉంటుంది. తెలంగాణ నేలలో జరిగిన పోరాటాలు ప్రపంచ విముక్తి పోరాటాలకు ప్రేరణగా నిలిచాయి. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు దేశంలోని పలు ఉద్యమాలకు బాటలు వేశాయి. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన పోరాటాలు దేశంలో భూసంస్కరణలకు కారణమయ్యాయి. ఈ నేలపైన సాగిన ఉద్యమాలు చరిత్రకే కొత్త పాఠాలు నేర్పాయి. ‘నీళ్లు.. నిధులు.. నియామ కాలు’ కోసం అరవై ఏళ్ల ఒక జాతి కలను తన పద్నాలుగేళ్ల పోరాటం ద్వారా కేసీఆర్ విజయతీరా లకు చేర్చారు. ఈ ఉద్యమం రాజకీయ ఉద్యమంతో మమేకమై చివరికి తమ ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో కార్యరూపం దాల్చడంతో సఫలీకృతమైంది. ఒక్కరేమిటి.. సబ్బండ వర్ణాలు ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించాయి. వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. టీఆర్‌ఎస్ ప్రస్థానమంతా ఉద్యమ ప్రస్థానంగానే కొనసాగడంతో అది ఉద్యమానికి ఊపిరైంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గెలిపించేందుకు రాజకీయ ప్రక్రియ రూపంలో ముందుకు సాగింది. తెలంగాణ ప్రజలందరూ గెలిచారు. ఆ ప్రజల ఆకాంక్షల గెలుపు వెనుక అమరుల త్యాగం, ఉద్యమ ఆకాంక్షలతో దూసుకుపోయిన ప్రజలు, ఒంటి చేత్తో టీఆర్‌ఎస్‌న, ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్, ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొత్తం తెలంగాణ చరిత్రను ఒక మలుపు తిప్పాయి. ఉద్యమాన్ని రాజకీయ ప్రక్రియగా మలిచి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి టీఆర్‌ఎస్ బలమైన రాజకీయ సాధనంగా పనిచేసింది. తెలంగాణ మహోన్నతమైన సంకల్పాన్ని గాంధేయ మార్గంలో రాజకీయ ప్రక్రియగా మలిచి దాన్ని లక్షలాది మంది... సింహగర్జనగా, జనగర్జనగా మార్చగలిగారు కేసీఆర్.2009 డిసెంబరు 23న యూపీఏ ప్రభుత్వం రెండో ప్రకటన వచ్చాక తెలంగాణ సమాజమంతా ఏకమైంది. రాష్ట్ర సాధనకు ప్రతినబూని ముందుకు సాగింది. కేసీఆర్ చొరవ తీసుకుని అన్ని పార్టీల నాయకులను సంప్రదించారు. 2009, డిసెంబరు 24వ తేదీ నాడు అన్ని పార్టీలు కలిసి కళింగభవన్‌లో సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు హాజరై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని తీర్మానించాయి. ఈ చారిత్రక నేపథ్యంలోనే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ఏర్పడింది. జేఏసీ ఏర్పడిన నాటికి అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులు రాజీనామా చేశారు. జేఏసీ తీసుకున్న మొట్టమొద టి కార్యక్రమం శాసనసభ్యుల రిలే దీక్షలు. ఈ దీక్షా కార్యక్రమాలు 16 జనవరి 2010 నుంచి దాదాపు నెలరోజులు గడిచాయి. దానికి కొనసాగింపుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, పట్టణాల్లో రిలే దీక్షలు కొనసాగాయి. ప్రతి గ్రామం నుంచి కులాల వారీగా ప్రజలు పాల్గొని దీక్షలను విజయవంతం చేశారు.తెలంగాణ సాధనకు వినూత్న రూపాలలో ఆందోళనా కార్య క్రమాలు కొనసాగాయి. సకలజనుల సమ్మె చుట్టూ అల్లుకుని ర్యాలీ లు, సభలు, సదస్సులు, ప్రదర్శనల రూపంలో విస్తృతంగా ప్రజలను కదిలించేందుకు నిర్ణయించారు. ఆ క్రమంలో జరిగిన మొదటి కార్యక్రమం సాగరహారం. పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నా, టియర్ గ్యాస్ పేల్చుతున్నా, విపరీతంగా వర్షం కురుస్తున్నా సమరోత్సా హంతో కదిలివచ్చిన ప్రజలు క్రమశిక్షణతో ప్రదర్శనలో పాల్గొన్నారు. సాగరహారంలో జరిగిన భారీ ప్రదర్శనను చూసిన తరువాత ఇక తెలంగాణ ఏర్పాటు అనివార్యమనే భావన అందరిలోనూ వచ్చింది. కేంద్రప్రభుత్వం కూడా 2012 డిసెంబరులో నాడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. నెలలోపే తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపుతామని కేంద్ర హోంమంత్రి ప్రకటన చేశారు. ప్రకటన ఇవ్వవలసిన తేదీనాడు హైదరాబాద్లో జేఏసీ సమరదీక్షను నిర్వహించింది. ప్రకటన రావటానికి సమయం పడుతుందని కేంద్రం ప్రకటించటంతో సమరదీక్షలో నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ తరువాత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి వరుసగా సడక్‌బంద్, సంసద్ యాత్ర, చలో అసెంబ్లీ కార్యక్రమాలు జరిగాయి. చివరకు  2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్  కమిటీ యూపీఏ కమిటీని సంప్రదించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అస్తిత్వం బయటపడ్డ తర్వాత ఇందుకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆవిర్భవించింది. టీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యం కావటంతో ఆ పార్టీ నేతృత్వంలో బలమైన ఉద్యమాలు మొదైలె.. రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయగలిగాయి. టీఆర్‌ఎస్ ఏర్పాటు వల్ల మరో లాభం కూడా కలిగింది. అప్పటికే ఉన్న ప్రజా సంఘాలను ఆనాటి పాలకులు నక్సలైట్ల పేరుతో అణచివేయగలిగారు. పనిచేయకుండా కట్టడిచేసే యత్నాలు చేశారు. కానీ ఎన్నికల ద్వారా తెలంగాణ తెస్తానన్న టీఆర్‌ఎస్‌పైన అదే వ్యూహం అమలుచేయలేకపోయారు. ప్రజాసంఘాల భావవ్యాప్తి ఆందోళన కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌కు బలమైన పునాది ఏర్పడితే, టీఆర్‌ఎస్ ఏర్పాటుతో కొంత స్వేచ్ఛగా తెలంగాణలో తిరిగేందుకు, ప్రజాసంఘాలు, పని ముమ్మరం చేసుకునేందుకు ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి అవకాశం కలిగింది.  2004లో తెంగాణ నినాదం ఎన్నికల ఎజెండాగా మారింది. 2004 ఎన్నికల్లో తెలుగుజాతి రాజకీయాలు ఓడిపోయి తెలంగాణ అస్తిత్వ పోరాటాలు గెలిచాయి. 2009 తర్వాత ఈ పరిస్థితి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రావటానికి తోడ్పడింది. రాజకీయంగా తెలంగాణ నినాదం బలంగా వ్యక్తమైనప్పటికీ యూపీఏ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకో లేకపోయింది. అందువల్లే కేసీఆర్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమ నిర్మాణానికి క్షేత్రస్థాయికి రావాల్సి వచ్చింది. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను ప్రజలను మరింత కదిలించే వేదికగా చేశారు. 2011 మార్చి 10.. మిలియన్ మార్చ్ సాధించిన విజయం తెలంగాణ ఆశకు, ఆశయానికి స్ఫూర్తినిచ్చింది. కేసీఆర్ ఏర్పాటు చేసిన మీద తెలంగాణ సమాజంలో విశ్వాసాన్ని పెంచింది. ఇది ఎందరి గుండెల్లోనో.. మరుపురాని జ్ఞాపకంగా.. నిత్య స్ఫూర్తిగా నిలిచింది. ‘మిలియన్ మార్చ్’ తో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఆంక్షల పద్మవ్యూ హాన్ని బద్దలుకొట్టుకుని లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ జనంతో ఆరోజు ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా.. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. ఆనాడు ‘మిలియన్ మార్చ్’ ధాటికి పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు.మొత్తం 42 రోజుల పాటు ఉద్విగ్న భరితంగా సాగిన ఈ పోరాటం.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నేతృ త్వంలో సాగిన ఈ మహోన్నత పోరాటం ఏక బిగువున సాగింది. 2011 సెప్టెంబర్13న తెలంగాణవ్యాప్తంగా సకల జనుల సమ్మె ప్రారంభమైంది. నిర్భందాలను ధిక్కరించి ప్రజలు ఎక్కడికక్కడ సమ్మె లోకి దిగారు. ఐదు లక్షల మంది ఉద్యోగులు దసరా పండుగను కూడా త్యాగం చేసి జీతాలు లేకుండా పస్తులుండి మ డమ తిప్పని పోరాటం చేశారు.2009, నవంబరు 27న కేసీఆర్ తలపెట్టిన ఆమరణ దీక్ష ఆయన రాజకీయ జీవితంలో మరిచిపోలేని ఘట్టం. ఆ సందర్భంలోనే ఆయన ‘‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’’ ఇచ్చిన నినాదం నినాదమే తెలంగాణ సమాజాన్ని చలింపచేసింది. ‘‘అయితే జైత్ర యాత్ర.. లేదంటే శవయాత్ర’’ తన దీక్షకు ముందు కేసీఆర్ చేసిన ఈ నినాదం కూడా ప్రజల గుండెలను తాకింది. వచ్చిన తెలంగాణను సీమాంధ్రులు అడ్డుకున్న తర్వాత ఉద్యమ క్రమంలో ‘‘యాచించి కాదు.. శాసించి తెచ్చుకుందాం’’ నినాదం వాడవాడలా మార్మోగిపోయింది.కేసీఆర్ 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా, కేసీఆర్ దీక్షకు సంఘీభావంగా నవంబర్ 16న తెలంగాణ విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డారు. ఈ ప్రభావంతో కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహా త్మాగాంధీ విశ్వవిద్యాయాల్లో ఐక్య కార్యాచరణ సమితులు ఏర్పడ్డాయి. నవంబర్ 29న ప్రభుత్వం దీక్షను అడ్డుకునేందుకు కేసీఆర్‌ను అరెస్టు చేయడంతో తెలంగాణ అట్టుడికిపోయింది. అయినా ఆయన దీక్షను ఆస్పత్రిలో కొనసాగించారు. కేసీఆర్ దీక్షకు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొత్తం తెలంగాణ సమాజాన్ని కదిలించింది. ఇదే సమయంలో శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకోవడంతో తెలంగాణ మొత్తం భగ్గుమంది. కేసీఆర్ దీక్ష ఒక పక్క, అందుకు మద్దతుగా ప్రజలు ప్రజా ఉద్యమంగా నిరసన తెలపడంతో కేంద్రం కదిలిపోయింది.అమరుల త్యాగాలతో తెలంగాణ తల్లడిల్లుతుంటే తన ఆమరణ నిరాహారదీక్షతో కేంద్రంతో 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం అన్న ప్రకటన తెప్పించగలిగారు..

Related Posts