YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

పోలింగ్ లో కోవిడ్ నిబంధనలు పాటించాలి

పోలింగ్ లో కోవిడ్ నిబంధనలు పాటించాలి

పోలింగ్ లో కోవిడ్ నిబంధనలు పాటించాలి
జోగుళాoబ గద్వాల మార్చి 13,
ఆదివారం రోజు జరుగుతున్నల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలను ఇన్సిడెంట్ ఫ్రీ గా నిర్వహించేందుకు  ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందికి వారు పాటించాల్సిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తల పై  జిల్లా ఎస్పీ  జె. రంజన్రతన్ కుమార్ గారు  సిబ్బందికి  బ్రీఫింగ్ ఇచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో  ఎస్పీ  మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల  దగ్గర విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరి గా కోవిడ్ నిబంధనలు పాటించాలని, అలాగే ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటించేటట్లు చూసుకోవాలని అన్నారు.  పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎవరు గుమికూడకుండా చూసుకోవాలని, పోలింగ్ కేంద్రం లోపలికి  నిషేధిత వస్తువులు అయిన అగ్గిపెట్టే, రసాయన ఇంకు బాటిల్స్, వాటర్ వాటిల్స్ వంటివి తీసుకెళ్ళనియకుండా అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లు క్యూ లైన్ లో భౌతిక దూరం పాటించేటట్లు చూడాలని, గుర్తింపు కార్డులు ఉన్న పోలింగ్ ఎజెంట్లను మాత్రమే పి. ఓ అనుమతి మేరకు లోపలికి పంపాలని, పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం , బెదిరింపులకు పాల్పడటం వంటివి జరుగకుండా చూసుకోవాలని , ఏదయినా సంఘటన జరిగిన ,శాంతిభద్రతల సమస్య  తలెత్తిన వెంటనే మొబైల్ పార్టీ కి గాని, సంబంధిత అధికారి కి తెలియజేయాలని సూచించారు.
  ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుండి   బ్యాలెట్ బాక్స్ ల ను బస్సు లలో   తీసుకెళ్లడం జరుగుతుందని నియమించబడిన రూట్ మొబైల్ పార్టీ సిబ్బంది ఆయా బస్సులకు రక్షణగా ఉంటూ బ్యాలెట్ బాక్స్ లను సురక్షితంగా ఆయా పోలింగ్ స్టేషన్ లకు చేర్చాలని, ఎన్నికల అనంతరం ఎన్నికల సిబ్బంది పోలింగ్ మెటీరియల్,బాక్స్ లను బస్సు లలో కౌంటింగ్ కేంద్రాలకు   చేర్చే వరకు మొబైల్ పార్టీ సిబ్బంది రక్షణ కల్పించవలసి ఉంటుందని అన్నారు.  ప్రతి పోలింగ్ లొకేషన్ కు  ఒక ఎస్సై ఇంఛార్జిగా విధుల్లో ఉంటారని, వీరే కాకుండా సర్కిల్ పరిధిలో స్ట్రైకింగ్ ఫోర్స్ లు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లు నియమించడం జరిగిందని ఎన్నికలను ఇన్సిడెంట్ ఫ్రీ గా నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని  ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్ డి. ఎస్పీ యాదగిరి,  సాయుధ దళ డి. ఎస్పీ సత్యనారాయణ,  ఎస్బి ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి, పి సి ఆర్ ఇన్స్పెక్టర్ జనార్దన్, ఆర్. ఐ పెద్దయ్య, ఎస్సై లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts