ఈ షో నాకు ఒక లెర్నింగ్
జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్ మార్చి 13,
జెమిని టీవీ నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రయంపై మీడియా సమావేశం నిర్వహించారు. ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ హజరయ్యారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇది ఒక కొత్త జర్నీ. బిగ్ బాస్ తరువాత ప్రజలతో మమేకమవడానికి ఇది ఒక కొత్త జర్నీ. ప్రజల జీవితాల్లో వుండే జర్నీ నీ తెలుసుకోవడం ఎంతో ఎగ్జయిటింగ్ గా వుంటుంది. చిరంజీవి, నాగార్జున గారు చేసిన ఈ షో నీ ఒక గౌరవ ప్రదంగా ఒప్పుకోవడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా లాంటి పెద్ద మూవీలో పార్ట్ అవ్వడ తోనే సోషల్ మీడియాలో ఎక్కువ ఉండటం లేదు. నేను ఏరోజు అభిమానులతో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పలేదు. ఈ షో లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో చేస్తామా లేదా అనేది జెమిని ,స్టూడియో నెక్స్ట్ వాళ్ళు చెప్పాలి ముందు ఒక ఎపిసోడ్ అవనియ్యండి. ఈ షో ద్వారా ఒక మంచి వ్యక్తిగా, మంచి నటుడిగా ఉండగలనని అయన అన్నారు. ఈ షో నాకు ఒక లెర్నింగ్. ఈ షో ద్వారా నేను ఎంతో కొంత నేర్చుకో గలను. ఈ షో కి వచ్చే వ్యక్తి ఎలావుంటాడో , అతని మైండ్ సెట్ ఎలావుంటుందో తెలీదు. మనిషుడు అనే వాడు అసమానుడు.ఈ షోకి వచ్చిన ప్రతి వ్యక్తి గెలవాలి .అయితే అతను ఎంత గెలుస్తాడు అనేది చూడాలి. బిగ్ బాస్ కన్నా ఇక్కడ ఎక్కువ ఎమోషన్స్ వుంటాయి. రాజకీయం గురించి ఇప్పుడు మాట్లాడడం సందర్భం కాదని అయన అన్నారు.