YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ - ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌   - ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

మార్చి 13,  మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతీవార్డుకు రెండు టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ సెంట‌ర్‌లలో ఆర్వోలదే తుది నిర్ణయం. మధ్యాహ్నం లోపు ఫలితాలు వెలువడనున్నాయి. పురపోరులో 32వార్డుల్లో బరిలో నిలిచిన వారి భవితవ్యం అదివారం తేలనుంది. ఓట్ల లెక్కింపునకు బనవాసిలోని నవోదయ పాఠశాలలో కౌంటింగ్ సెంట‌ర్ ను మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు.మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్‌లను లెక్కిస్తారు.తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభ‌జించి బండిల్ష్‌గా కడతారు.అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. రిట‌ర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం. ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలకు అభ్యర్థులు, వారి కౌంటింగ్‌ ఏజెంట్లు ఉదయం 7గంటల వరకే చేరుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.అందరి సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ తలుపులు తెరిచి, బ్యాలెట్‌ బాక్సులు పరిశీలించి, ఆ తర్వాత కౌంటింగ్‌ హాల్‌లోకి తరలిస్తారు.ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్ట్రాంగ్‌ రూమ్‌లోనే తెలియజేయాలని.. ఆలస్యంగా వచ్చి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ ప‌త్రాల ప‌రీశీల‌న‌,తిర‌స్కర‌ణ నుండి ఫ‌లితాలు ప్ర‌క‌టించే వ‌ర‌కు.. రిట‌ర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం కానుంది. మధ్యాహ్నంలోపే ఫలితాలు వెల్లడి  బ్యాలెట్ పత్రాలు అయినప్పటికీ ఫలితాలు త్వరగా వెలువడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.   అటు కౌంటింగ్‌ సెంటర్ల దగ్గర ఘర్షణలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పట్టణ సి.ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఫలితాలు వెలువడే వరకు కౌంటింగ్‌ సెంట‌ర్ల దగ్గర 144 సెక్షన్‌ విధించారు.

Related Posts