YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతులను మోసం చేయడమేనా . రైతు భరోసా

రైతులను మోసం చేయడమేనా . రైతు భరోసా

విజయవాడ మార్చి 13, ఓబులాపురం మైనింగ్, జగతి పబ్లికేషన్ అంశాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి  తెలుగుదేశం గురించి విమర్శించడం హాస్యాస్పదమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు.  రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని వైసీపీ 10 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటోంది? ప్రజా సంక్షేమం గురించి వైసీపీ మాట్లాడితే జనం నవ్వుతారు. రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేయడమేనా ప్రజా సంక్షేమమంటే? అమ్మఒడి పేరుతో అమ్మలందరినీ మోసం చేయడమేనా ప్రజా సంక్షేమమంటే? బడుగు, బలహీన వర్గాల నిధులను పక్క దారి పట్టించడమేనా ప్రజా సంక్షేమమంటే? రూ. 3 వేల పెన్షన్ ఇవ్వకుండా మోసం చేయడమేనా ప్రజా సంక్షేమమంటే? పేదవారికి రూ. 5 కే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేయడమేనా ప్రజా సంక్షేమమంటే? నిరుద్యోగ భృతి ఆపేయడమేనా ప్రజా సంక్షేమమంటే? రుణమాఫీ తీసేయడమేనా ప్రజా సంక్షేమమంటే? బడుగు, బలహీన వర్గాలకు ఉపాధినిచ్చిన ఆదరణ పథకాన్ని నిలిపేయడమేనా ప్రజా సంక్షేమమంటే? వైసీపీ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కాదు..ప్రజా క్షామమని అన్నారు.  జగన్ అంటే లక్షలాది బాధితులు-వేలమంది నేర చరితులు. రెండేళ్ల వైసీపీ పాలనలో ప్రజా సంక్షేమ పాలనకు తూట్లు పొడిచారు.  కర్నూలును కరోనా బారిన పడేశారు-విశాఖను భూకబ్జాలకు నిలయంగా మార్చారు. అమరావతిని వల్లకాడు చేసేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో అభివృద్దిని కాలరాశారు. విశాఖ నుంచి అంతర్జాతీయ కంపెనీలను తరలిమేశారు. లోపాయికారి ఒప్పందాలతో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేశారు. ప్రత్యేక హోదాను అటకెక్కించారు. చంద్రబాబు గారి హయాంలో తీసుకొచ్చిన స్పెషల్ ఫైనాన్స్ ఎసిస్టెన్స్ స్కీమ్ ను అందిపుచ్చుకోలేకపోయారు. హోదా పేరుతో రూ. 14,000 కోట్లు ఏపీకి చంద్రబాబు గారు తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చింది? 28 మంది వైసీపీ ఎంపీలుండీ గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా అని ప్రశ్నించారు.
వైసీపీ ఒక చీడ- జగన్ రెడ్డి ఒక పీడ . కరోనా వైరస్ మాదిరి ఏపీకి వైసీపీ చుట్టుకుంది. వైసీపీ వైరస్ కు వ్యాక్సిన్ రావాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందే. లక్షా యాభై వేల కోట్లు అప్పులు చేశారు. 60 వేల కోట్ల పైన పన్నుల భారం మోపారు. ప్రతి మనిషిపై రెండున్నర లక్షల అప్పు వేశారు. విజయవాడలో వైసీపీ ప్రభుత్వం ఇండస్ట్రియల్ సమ్మిట్ కు పట్టుమని 10మంది పారిశ్రమిక వేత్తలు కూడా రాలేదు. వైసీపీకి వాటాలు ఇవ్వాల్సి వస్తుందనే భయంతో వెనక్కు తగ్గారు. టీడీపీ హయాంలో విదేశీ పెట్టుబడులు తేవడంలో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో నిలిస్తే.... వైసీపీ ప్రభుత్వం 12వ స్థానంలోకి ఏపీని నెట్టింది.  మోసాలు, దగాలు, కబ్జాలు, మాఫియాలతో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. విశాఖ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. నేరగాళ్లా నీతులు చెప్పేది? ఏపీని మోసం చేయడం మొదలు పెట్టి 10 సంవత్సరాలయ్యింది. ఈ పదేళ్లలో రెండేళ్లు మీరు జైల్లోనే మగ్గారు. దళితులు, మైనారిటీలు, మహిళలపై దాడులు పెరిగాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు చేస్తున్న ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. ఉద్యోగులను జీతాలు ఇవ్వలేని దుస్థితి వైసీపీ ప్రభుత్వానిది. ధరలు పెంచి మనుషుల రక్తం పిండితున్నారు. వైసీపీ చేసుకోవాల్సింది నమ్మకద్రోహ వారోత్సవాలు. ముద్దాయి పాలకుడు అయితే ఆ రాష్ట్రం ఎలా ఉంటుందో ఏపీ ఉదాహరణ. టీడీపీకి భవిష్యత్ లేదని సజ్జల వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. ఓటమి భయంతోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు దిగింది.  టీడీపీ నీతిగా, నిజాయితీగా  విజయం సాధించింది. వైసీపీ తాటాకు చప్పుళ్లకు మేం భయపడేది లేదు. వైసీపీకి ప్రజా బలం లేకనే టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్ లకు దిగుతున్నారు. మీడియాకు సంకెళ్లు వేస్తూ జీవో తెచ్చిన కుసంస్కారి వైసీపీ. జైలు పార్టీ కనుమరగవడం ఖాళీ. సొంత చెల్లే అన్నపై నమ్మకం లేక వేరే పార్టీ పెట్టింది. భవిష్యత్ లో వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకరు. వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. టీడీపీ తరపున పోటీ చేసిన మహిళలపై దాడులు చేశారు. అమరావతి మహిళలపైన వైసీపీ దాష్టీకాలు అన్నీఇన్నీ కావు. అచ్చోసిన ఆంబోతుల్లా వైసీపీ నేతలు గ్రామాలపై పడ్డారు. బూతులకు పేటెంట్ వైసీపీ నేతలదే. తండ్రి శవాన్ని పక్కన పెట్టి సంతకాలు చేయించుకున్న చరిత్ర జగన్ రెడ్డిది. చివరకు వైసీపీలో మిగిలేది ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5 మాత్రమే . వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద ఉన్న కేసులు చూస్తే  మతిపోవాల్సిందే. వైసీపీ నేర చరిత్ర పుట్టి పదేళ్లయింది. ధైర్యంగా ఎన్నికలు ఎదుర్కోలేని వైసీపీ వాళ్ల మగాళ్లేనా? రంగ నాయకమ్మపై కేసులు పెట్టడమా ప్రజా సంక్షేమమంటే? డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణిని వేధించడమేనా ప్రజా సంక్షేమమంటే? చంద్రబాబు పేరు ఉచ్ఛరించే అర్హత వైసీపీ నేతలకు లేదని ఆమె అన్నారు.

Related Posts