హైదరాబాద్ మార్చి 13, కాంగ్రెస్ పక్షాన ఎన్నికల సీఈవోను కలిశాం. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో టీ.ఆర్.ఎస్ అన్ని రకార అక్రమాలకు పాల్పడుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 43 శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ కావాలని ఉద్యోగుల కోరుతుంటే .. మీడియా లో 29 శాతం ఆంటూ లీక్ ఇచ్చారు. టీ.ఆర్.ఎస్ ను ఓడిస్తే.. ఉద్యోగుల కు అనుకూలమైన ఫిట్మెంట్ వస్తుంది. ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. స్కూల్ బస్సులను బలవంతంగా వాడుకుంటున్నారు.. వాటిపై చర్యలు తీసుకోవాలి. ఫేక్ ఓట్లను.. డిగ్రీ లేని వారిని ఓటింగ్ కు అనుమతి ఇవ్వవద్దని అయన కోరారు. వందల కోట్ల యాడ్స్ పై ఇన్ కమ్ ట్యాక్స్ విచారణ జరపాలి. పీవీ నరసింహారావు బతికున్నప్పుడు బూతు మాటలు మాట్లాడి.. ఇప్పుడు ఆయన బొమ్మ వాడకోవడాన్ని ఆక్షేపించాం. మా నాయకుడి ఫోటో పట్ల సీఈవో కు మా అభ్యంతరం తెలిపామని అన్నారు.