చెన్నై మార్చి 13
త్వరలో తమిళనాడు లో ఎన్నికల జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. ఇక ఈసారి అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్న డీఎంకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగుతుంది. మరోవైపు కమల్ హాసన్ కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తమిళనాడు ఎన్నికలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఫోకస్ పెట్టాడు. తాజాగా డీఎంకెఅన్నాడీఎంకె పై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డాడు. దినకరన్తో కలిసి పాల్గొన్న పొలిటికల్ ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ .. ప్రస్తుత అన్నాడీఎంకే ఒకప్పటి అన్నాడీఎంకే కాదు అని ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాని మోడీ కి బానిసగా మారింది అని జయలలిత ఉన్నంత కాలం బీజేపీ ని దగ్గరికి రానివ్వలేదు అని కానీ ఇప్పుడు అన్నాడీఎంకే అదే బీజేపీ తో పొత్తు పెట్టుకుంది అని విమర్శించారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న డీఎంకె సెక్యులరిజం విలువలపై అసదుద్దీన్ పలు ప్రశ్నలు సంధించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు శివసేన గొప్ప త్యాగం చేసిందని... అందుకు గర్వంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాక్రే అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. శివసేన చేసిన ఆ వ్యాఖ్యలను డీఎంకె సమర్థిస్తుందా నన్నుదినకరన్ ను బీజేపీ బీ టీమ్ అని ఆరోపిస్తున్నారు. కానీ శివసేన అధికారంలోకి రావడానికి సహకరించిన కాంగ్రెస్ తో డీఎంకె జతకట్టవచ్చు. మేము ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ లాభపడుతుందని వాదిస్తున్నారు.సెక్యులరిజం అన్న పదానికి తమ నిర్వచనమేంటో డీఎంకె చెప్పగలదా మహారాష్ట్రలో మహారాష్ట్రలో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న శివసేన సెక్యులరా కమ్యూనలా అని ప్రశ్నించారు.డీఎంకె కూడా తాము సెక్యులరిస్టులమని చెబుతూనే... కేంద్రం చేస్తున్న డ్రకోనియన్ చట్టాలకు మద్దతునిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేవలం అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం మాత్రమే మైనారిటీలుపేదల ప్రయోజనాలుహక్కులను కాపాడగలదని అన్నారు. దివంగత దిగ్గజ నేతలు కరుణానిధిజయలలిత లేకుండా తమిళనాడులో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.