YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానులకు ఓటేనా

మూడు రాజధానులకు ఓటేనా

మూడు రాజధానులకు ఓటేనా
అమరావతి, మార్చి 15, 
ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా సరే జనాభిప్రాయం తేలిపోతుంది. మూడు రాజధానుల అంశం మీద జనంలోకి వెళ్తాం, జనం వైసీపీని ఓడించి మరీ గుణపాఠం చెబుతారు. అదే అసలైన రెఫరెండం. 2020 అంతా టీడీపీ గర్జించిన తీరు ఇది. అసెంబ్లీ రద్దు చేసి వెంటనే ఎన్నికలు పెట్టండి, ప్రజాభిప్రాయం మళ్ళీ కోరండి అంటూ జగన్ సర్కార్ ని గట్టిగా డిమాండ్ చేసిన టీడీపీ తీరా స్థానిక ఎన్నికలు వచ్చేసరికి మాత్రం అసలు ఆ ఊసే తలవడంలేదు. దానికి కారణాలు పూర్తిగా రాజకీయమైనవే అంటున్నారు.
ఇక వైసీపీకి మూడు రాజధానులు అంతే ఎంత ముద్దో అందరికీ తెలిసిందే. మూడు రాజధానులకు మేము కట్టుబడిఉన్నామని తాజాగా ఈ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల వేళ గవర్నర్ నోట పలికించిన జగన్ సర్కార్ పంచాయతీ ఎన్నికల నుంచి మునిసిపల్ ఎన్నికల దాకా ఇపుడు ఆ మాటే అనకపోవడం చిత్రాతిచిత్రమే. మూడు రాజధానుల అజెండాతోనే మేము జనంలోకి వస్తాం, ప్రజలంతా దీనికి సర్వామోదం పలుకుతారు అని నాడు గాంభీర్యం ప్రదర్శించిన వైసీపీ పెద్దలు ఇపుడు మాత్రం ఒక్కసారిగా మౌనం దాల్చడం విస్మయం కలిగించేదే.నిజానికి మూడు రాజధానులు అని వైసీపీ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేస్తే విజయవాడ గుంటూర్ లలో శృంగ భంగం అవుతుందని భయపడుతోంది అంటున్నారు. అమరావతి రాజధాని పరిధిలో ఈ రెండు కార్పొరేషన్లు ఉన్నాయి. అంతే కాదు అనేక మునిసిపాలిటీలు కూడా ఉన్నాయి. దాంతో ఎదురుగాలి వీస్తుందనే వైసీపీ వ్యూహాత్మకంగా మౌనం దాల్చింది అంటున్నారు. ఇక కర్నూలు, విశాఖలో విజయం దక్కినా కూడా అమరావతి పరిధిలో అప్పనంగా టీడీపీ గెలుపు అవకాశాన్ని ఇవ్వడం ఎందుకు అన్న దూరాలోచనతోనే వైసీపీ ఇలా చేస్తోంది అంటున్నారు.ఇక చంద్రబాబు విషయం కూడా సేమ్ టూ సేమ్. ఆయన సైతం అమరావతి రాజధాని ప్రాంతంలో మూడు రాజధానులు వద్దు అని గట్టిగా గర్జించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ మాట బాబు అంటే కచ్చితంగా విశాఖ కార్పొరేషన్ లో టీడీపీ దారుణమైన ఫలితాలను అందుకుంటుంది. కర్నూలు కార్పొరేషన్ లో కూడా ఏమీ కాకుండా పోతుంది. అంతే కాదు, ఇటు ఉత్తరాంధ్రా, అటు రాయలసీమలలో కూడా టీడీపీకి ఎదురుగాలి వీస్తుంది. దాంతో అన్నీ తెలిసిన బాబు చాలా గుంభనంగా ఉంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల గురించి మాట్లాడకూడదని ఒట్టేసుకున్నారు కూడా.

Related Posts