తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్
తిరుపతి, మార్చి 15,
తిరుపతి పార్లమెంట్ పరిధిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండడంతో ఇక్కడ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ? ఎవరిక్ అనుకూలంగా వస్తాయనే ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఇక్కడ ఎవరూ ఊహించాని రీతిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇక్కడ సత్తా చాటుతామని భావింఛి ఎంపీ సీటు మాకు కావాలంటే మాకు కావాలని కొట్టుకుంటున్న జనసేన – బీజేపీల పరువు పోయినట్టు అయింది.తిరుపతి కార్పొరేషన్ విషయానికి వస్తే 50 డివిజన్ లు ఉండగా వైసీపీ -48, టిడిపి -1 స్థానాలు సాధించాయి, జనసేన బీజేపీలు ఒక్క సీటు కూడా గెలుచుకో లేకపోయాయి. సూళ్లూరుపేట మున్సిపాలిటీ లో మొత్తం 25 వార్డులు ఉండగా వైసీపీ 24 సాధించింది, టీడీపీ 01 స్థానానికి పరిమితం అయింది. ఇక బీజేపీ -జనసేనలు ఖాతా తెరవలేకపోయాయి. వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకి వైసీపీ 25 క్లీన్ స్వీప్ చేసింది. నాయుడుపేట మున్సిపాలిటీ -25 వార్డులకు గాను వైసీపీ 23 వార్డులు, టిడిపి 01, బిజెపి 01 స్థానంతో సరిపెట్టుకుంది.
తిరుపతిపై జనసేన ఆచితూచి
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన బీజేపీకి మద్దతిస్తుందా? బయటకే మద్దతా? లోపాయికారిగా టీడీపీకి మద్దతిస్తుందా? ఇదే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి పార్లమెంటుఉప ఎన్నికల బరిలో తాము పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే ఇందులో లోపాయికారీ ఒప్పందం ఉందన్న అనుమానం ఉంది. తొలినుంచి తామే పోటీ చేస్తామని బల్లగుద్ది చెప్పిన పవన్ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకోవడంతోనే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పంథా కొనసాగింది. అనేక చోట్ల టీడీపీ, జనసేనలు లోపాయికారిగా ఒకరికొకరు మద్దతిచ్చుకున్నాయి. అనేక చోట్ల ఈ ఫార్ములా పనిచేసింది. అయితే తిరుపతి ఉప ఎన్నికలోనూ ఇదే జరుగుతుందని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినప్పటికీ క్యాడర్ మాత్రం టీడీపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయింది.కారణాలు కూడా లేకపోలేదు. ఇక్కడ బీజేపీకి గెలిచే అవకాశాలు లేవు. ప్రధాన శత్రువు వైసీపీని ఓడించాలంటే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడం వేస్ట్. అందుకే టీడీపీ అభ్యర్థికి మద్దతు లోపాయికారీగా ఇవ్వాలన్నది జనసేన స్థానిక నేతల అభిప్రాయంగా ఉంది. తొలినుంచి తాము కోరుకున్న సీటును ఇవ్వకుండా బీజేపీ పదే పదే ఇబ్బంది పెట్టింది. అంతేకాదు రెండు నెలల ముందే సోము వీర్రాజు బీజేపీ అభ్యర్థి ఉంటారని ప్రకటించారు. అయితే పవన్ కల్యాణ్ తమ పార్టీ మద్దతిస్తుందని ప్రకటించారు. కానీ జనసైనికులు మాత్రం బీజేపీకి మద్దతిచ్చేందుకు ఇష్టపడటం లేదు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ కల్యాణ్ ను రావద్దని జనసైనికులు ఇప్పటికే కోరినట్లు చెబుతున్నారు. జనసేన అభ్యర్థి అయితేనే తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి కూడా రారని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికే జనసేన మద్దతు తెలపనుందని సమాచారం.