YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో పంచాయితీకి సిద్ధం

తెలంగాణలో పంచాయితీకి సిద్ధం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు మూహూర్తం సమీపిస్తోంది. కొత్త చట్టం ప్రకారమే పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 30 నుంచి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లలో ముసాయిదా ఓటరు జాబితాను వార్డుల వారీగా ప్రదర్శిస్తారు. మే ఒకటో తేదీ నుంచి జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో,  రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. మే మూడో తేదీ నుంచి ఎంపీడీవో సమక్షంలో మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. మే ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు వార్డు, గ్రామస్థాయి ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. మే పదో తేదీలోగా ఆయా ఫిర్యాదులకు పరిష్కారం చూపుతారు. అనంతరం మే 17న తుది జాబితాను ప్రకటించనున్నారు.కొత్త పంచాయ తీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను సవరించి, విభజించేందుకు సమయాత్తమవుతోంది. ఈ మేరకు జాబితాల తయారీ కోసం  షెడ్యూల్ ప్రకటించింది. మొత్తంగా మే 17న నాటికి తుది ఓటర్ల జాబితాను  ప్రకటించనుంది. ఈ లెక్కన జూలైలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.  ప్రతి పంచాయతీకి జనాభా ఆధారంగా వార్డుల సంఖ్యను ఇప్పటికే చట్టంలో నిర్దేశించారు. ఈ సంఖ్యకు అనుగుణంగా ఓటర్లను సమానంగా విభజిస్తారు. ఒక కుటుంబంలోని ఓటర్లందరినీ ఒకే వార్డులో ఉండేలా చేస్తారు. పోలింగ్ కేంద్రాల వారీగానూ ఓటరు జాబితాను తయారు చేస్తారు. టీ-పోల్ సాఫ్ట్‌వేర్‌తో పంచాయతీల వారీగా ఓటరు జాబితా సవరిస్తారు.

Related Posts