YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వాట్స్ ప్ తో నామినేషన్లు

వాట్స్ ప్ తో నామినేషన్లు

కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు సంచలనంగా మారాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వాట్సాప్‌లో వచ్చిన నామినేషన్లను కూడా ఆమోదించాలని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తాము నామినేషన్లు వేసినా అవి చెల్లలేదంటూ 9మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు... అభ్యర్థుల వాదనల్ని వినింది. తాము నామినేషన్లు వేయకుండా కొందరు అడ్డుకున్నారని... పేపర్లను కూడా లాక్కొన్నారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే వాట్సాప్‌లో నామినేషన్లను పంపామని... వీటిని స్వీకరించేలా అధికారుల్ని ఆదేశించాలని కోర్టుకు తెలిపారు. వారి నామినేషన్లను ఆమోదించాలని అధికారుల్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కు వాయిదా వేసింది. ఈ ఆదేశాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసాధారణ పరిస్థితుల్లోనే కోర్టు ఇలా స్పందించిందని... ప్రతిసారీ వాట్సాప్‌లో నామినేషన్లను ఆమోదించరని సీనియర్ లాయర్లు అంటున్నారు.   

Related Posts