మచిలీపట్నం మార్చి 15,
మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన పోరాటం మరచిపోలేనిదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు అనేది సహజం. తెలుగుదేశం పార్టీ అనేక అటు పోట్లను ఎదుర్కొంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, బెదిరింపులకు ప్రజలు ఆందోళన చెందారు. మాకు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని అధికార పార్టీ నేతలు ఓటర్లను బ్లాక్ మెయిల్ చేశారు. వాలంటీర్లను వినియోగించుకుని ప్రజలపై ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులకు అభినందనలు. ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో మీరందరూ ముందుకు వచ్చారు. ఓటమి వచ్చిందని నిరాశపడకుండా రెట్టింపు ఉత్సహంతో ముందుకు వెళ్లాలి. ఎన్నికల బరిలో నిలిచి వీరోచితంగా పోరాడి ఓడిపోయిన అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అన్నారు. కార్యకర్తలు ఎవ్వరు అధైర్య పడొద్దు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించడం తధ్యం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కార్యకర్తలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా ఉండేందుకు సిద్ధమని అయన అన్నారు.