YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మా ఎమ్మెల్యే కనపడడంలేదు వేములవాడ కాంగ్రెస్ నేతల అందోళన

మా ఎమ్మెల్యే కనపడడంలేదు వేములవాడ కాంగ్రెస్ నేతల అందోళన

హైదరాబాద్ మార్చి 15, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు కనిపించడం లేదంటూ అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. సోమవారం ఉదయం వేములవాడ  నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఒక్కసారిగా ప్లకార్డులను ప్రదర్శించుకుంటూ అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఏడాదిగా ఎమ్మెల్యే జర్మనీలో వుంటూన్నారు. అయన స్థానికంగా లేకపోవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదని వారు ఆరోపించారు.  అందోళనకారులను  పోలీసులు అడ్డుకున్నారు.  తమ సమస్యలపై నిరసన తెలుపుతుంటే  అక్రమంగా అరెస్ట్ చేశారని వారు. ఆరోపించారు. ఆరెస్టైయిన వారిని పోలీసులు బేగం బజార్ పోలీసు స్టేషన్ కు తరలించారు.  మరోవైపు టీపీసీసీ వర్కింట్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వేములవాడ శాసనసభ్యుడు రమేష్ రావు  ఒక సంవత్సరం గా దేశంలో వుండకపోవడంపై మండిపడ్డారు. అయన  జర్మనీ లో వుంటే ప్రజలు పడుతున్న కష్టాలు ప్రభుత్వం కు కనిపించడం లేదని అన్నారు. శాసనసభ  స్పీకర్, ఒక  సభ్యుడు యేడాది గా సభ  కు రాకుండా వున్నా జీతాలు అలవెన్సు లు నెలకు 4 లక్షలు  ఇస్తున్నారని అన్నారు. మా ఎమ్మెల్యే ఎక్కడ  అడగడం తప్పు అనే విధంగా ప్రజలను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నానన ఇఅన్నారు. వుంటనే ముఖ్యమంత్రి ఈ అంశంపై సభ లో ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు.

Related Posts