YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బ్యాంకుల చెక్ బుక్కులు పనిచేయవు

బ్యాంకుల చెక్ బుక్కులు పనిచేయవు

ముంబై, మార్చి 15, 
బ్యాంక్ కస్టమర్లు ఒక విషయం తెలుసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన పాస్‌బుక్‌లు, చెక్ బుక్‌లు పని చేయవు. అందువల్ల ఖాతాదారులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ఏ ఏ బ్యాంకులకు చెందిన కస్టమర్లపై ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ వంటివి విలీనం అయ్యాయి. ఈ బ్యాంకులకు చెందిన పాస్‌బుక్స్, చెక్‌బుక్స్ ఏప్రిల్ నుంచి పని చేయవు.చెక్ బుక్స్, పాస్‌బుక్స్ మాత్రమే కాకుండా ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కూడా మారతాయి. బ్రాంచ్ అడ్రస్ కూడా మారుతుంది. ఇకపోతే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాక్ వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి.కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనం అయ్యింది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వంటివి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయాయి. అలహాబాద్ బ్యాంక్ అనేది ఇండియన్ బ్యాంక్‌లో విలీనం అయ్యింది. ఇప్పటికే బ్యాంకులు వాటి కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేశాయి.

Related Posts