ఎన్టీఆర్ బయోపిక్‌పై మరో న్యూస్ వైరల్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు తాను న్యాయం చెయ్యలేననిపించి... బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. సినిమా కూడా పట్టాలెక్కిన తర్వాత సడన్‌గా తేజ తప్పుకోవడమంటే పెద్ద షాక్ అని చెప్పాలి. ఆయన తప్పుకోవడానికి పూర్తి కారణాలు తెలియకపోగా... సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవలే బయోపిక్ షూటింగ్ హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. . బాలకృష్ణ 66 గెటప్స్ లో కనబడనున్న ఈ సినిమా గత నెల 29 నే భారీ హంగులతో పూజా కార్యక్రమాలతో మొదలై ఏకధాటిగా రెండు రోజుల పాటు షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే మొదటినుండి ఇంత భారీ సినిమా తేజ హ్యాండిల్ చేయగలడా అనే మీమాంశలో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. బాలకృష్ణ గత కొన్నాళ్లుగా ప్లాప్స్ లో ఉన్న తేజ కి ఒక్క సినిమా హిట్ తో ఇంత పెద్ద బాధ్యత మీద పెట్టడం కరెక్ట్ కాదేమో అనే అనుమానం అందరిలోనూ ఉంది.మరి అందరి మాటను పెడచెవిన పెట్టిన బాలకృష్ణ ఇండస్ట్రీలోని పెద్దలను, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని కూడా పిలిచి మరి ఎన్టీఆర్ బయో పిక్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఇక బాలకృష్ణ మొదటిరోజే దుర్యోధనుడిగా ఇరగదీసే పెరఫార్మెన్స్ చేసాడు. అయితే వచ్చేనెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ‘ఎన్టీఆర్’ బయో పిక్ నుండి దర్శకుడు తేజ బయటికెళ్లిపోయాడనే షాకింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది.అయితే తేజ ఎందుకు ఎన్టీఆర్ బయో పిక్ నుండి తప్పుకున్నాడో అనేది కారణాలు తెలియాల్సి ఉంది.బాలకృష్ణ కి ఉన్న దుందుడుకు తనానికి తేజ ఎమన్నా ఫీల్ అయ్యాడా.. అనే అనుమానం మాత్రం కలుగుతుంది. మరి పాపం తేజ ‘ఎన్టీఆర్’ బయో పిక్ కోసం వేంకటేష్ తో చెయ్యాల్సిన ‘ఆట నాదే వేట నాదే’ సినిమాని అటకెక్కించాడు. మరి బాలయ్య మీద నమ్మకంతో ఎన్టీఆర్ బయో పిక్ పై తేజ ఆరు నెలలుగా చాలా రీసెర్చ్ చేసాడు. మరి అంతా బాగున్నాక తేజ ఇలా ఎన్టీఆర్ బయో పిక్ నుండి బయటికి రావడం మాత్రం నిజంగా షాకింగ్ న్యూసే.