YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చిక్కుల్లో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్

చిక్కుల్లో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్

ముంబై, మార్చి 15, 
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసు ఊహించని మలుపులతో ఓ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. అంబానీ బెదిరింపుల కేసులో అనుమానితుడిగా అరెస్టయిన ముంబయి పోలీస్ అధికారి సచిన్ వాజేకు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరుంది. విధి నిర్వహణలో దాదాపు 63 మందిని హతమార్చి కిల్లింగ్‌ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న సచిన్.. ఉద్యోగ జీవితమంతా వివాదాలమయం. బాంబు పేలుడు కేసులో నిందితుడి సచిన్ కస్టడీలో చనిపోవడంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు.ఆ తర్వాత ఈ కేసు తేలకపోవడంతో రాజీనామా చేసి శివసేనలో చేరాడు. అత్యాధునిక సాంకేతికతను వాడటంలో నిపుణుడైన సచిన్.. తక్కువకాలంలోనే శివసేనలో కీలక నేతగా ఎదిగాడు. అయితే, మహారాష్ట్రలో శివసేన నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. కరోనా వ్యాప్తితో తగినంత మంది పోలీస్ అధికారులు లేరనే కారణంతో ఉద్ధవ్ ప్రభుత్వం సచిన్‌కు అత్యంత కీలకమైన క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు.టీఆర్పీ కుంభకోణం, ఓ ఆత్మహత్య కేసులో ఓ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అరెస్టు కేసు, హృతిక్‌ రోషన్‌ ఫేక్‌ ఈమెయిల్‌ కేసు, కార్‌ డిజైనర్‌ దిలీప్‌ ఛాబ్రియా కుంభకోణం కేసు వంటివి సచిన్‌ పర్యవేక్షించారు. ఆ తర్వాత ముఖేశ్‌ అంబానీ బెదిరింపుల కేసులో వాజే హడావుడి చేశారు. ఇదే సమయంలో ఆ కారు యజమాని మన్‌సుఖ్‌ అనుమానాస్పదంగా మృతిచెందడంతో కేసు మలుపు తిరిగింది. మన్‌సుఖ్‌ మంచి ఈతగాడు కావడంతో దీనిని హత్యగా పేర్కొంటూ ఆయన భార్య విమ్లా ఫిర్యాదు చేశారు.గతంలో నాలుగు నెలలు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు సచిన్‌ వాడారని, ఇటీవలే అది తమ చేతికి వచ్చిందని వెల్లడించారు. నవంబర్‌లో అర్ణబ్‌ గోస్వామి అరెస్టు సమయంలో ముంబయిలోని వర్లీకి ఇదే స్కార్పియోలో సచిన్‌ వచ్చినట్లు మీడియా సంస్థ కథనంలో పేర్కొంది. మన్‌సుఖ్‌ కుటుంబీకుల ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఎన్‌ఐఏ సచిన్‌ను గతవారం అదుపులోకి తీసుకొని కొన్ని గంటలపాటు ప్రశ్నించింది. ఆ తర్వాత అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టింది. న్యాయస్థానం మార్చి 25 వరకు ఎన్‌ఐఏ కస్టడీ విధించింది.

Related Posts