కర్నూలు మార్చి 15,
ఇదో విచిత్రమైన విన్నపం. నంద్యాలలో తాగుబోతుల విన్నపం అంటూ సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ గా మారింది. అసలు నిజమా కాదా అన్నది మాత్రం నిర్దారణ కావడంలేదు. నంధ్యాల 29వ వార్డులో ఓటు తో పాటు ఓ లెటర్ ని జత చేసి మందుబాబులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల అధికారి వెంకటకృష్ణ మాత్రం ఓటుతో పాటు ఎలాంటి లెటర్ లేదని అంటున్ఆనరు. ఆ లెటర్ లో సీఎం జగన్ కి మందుబాబుల విన్నపం వుది. వైన్ షాపుల్లో అమ్ముతున్న కొత్త కొత్త మద్యం బ్రాండ్లు తీసివేయలని వినతి చేసారు. పాత బ్రాండ్లనే యధావిధిగా అమ్మాలని..లేదంటే ఇదే మా యొక్క చివరి ఓటు మీకు అంటూ సియం జగన్ కు లెటర్ రాసారు