YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ వివేకా రెండవ వర్ధంతి

వైఎస్ వివేకా రెండవ వర్ధంతి

కడప మార్చి 15, 
కడప జిల్లా  పులివెందుల నియోజకవర్గం లో  వైయస్ వివేకానంద రెడ్డి రెండవ వర్ధంతి వేడుకలను పులివెందుల లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ వివేకా రెండో వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వైఎస్ వివేకా సమాధి వద్ద  వైయస్ వివేకా కుమార్తె సునీత, వైఎస్ విజయమ్మ, వైయస్ షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం  వైఎస్ వివేక నివాసం వద్ద ఉన్నటువంటి వైయస్ వివేక పార్కు వద్ద వికలాంగులకు దుస్తుల పంపిణీ చేశారు. అనంతరం ఇంటి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 

Related Posts