YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రెండేళ్లుగా ముద్రణ ఆగిపోయిన రూ.2000 నోటు

రెండేళ్లుగా ముద్రణ ఆగిపోయిన రూ.2000 నోటు

న్యూఢిల్లీ మార్చ్ 15
గ‌త రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించ‌డం లేద‌ని సోమ‌వారం లోక్‌స‌భ‌లో వెల్ల‌డించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. 2018, మార్చి 30నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఇక 2021, ఫిబ్ర‌వ‌రి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్ల‌కు త‌గ్గింద‌ని కూడా ఠాకూర్ తెలిపారు. ప్ర‌జ‌ల లావాదేవీల డిమాండ్ మేర‌కు ఓ డినామినేష‌న్ బ్యాంక్ నోట్ల ముద్ర‌ణపై ఆర్బీఐతో సంప్ర‌దించి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
2019-20, 2020-21ల‌లో రూ.2000 నోటు ముద్రించ‌లేద‌ని వెల్ల‌డించారు. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో మొత్తం 354.2 కోట్ల రూ.2000 నోట్ల‌ను ముద్రించిన‌ట్లు 2019లో ఆర్బీఐ తెలిపింది. అధిక విలువ క‌లిగిన నోట్ల ముద్ర‌ణ‌ను త‌గ్గించి, తద్వారా న‌ల్ల‌ధ‌నానికి అడ్డుక‌ట్ట వేసే ఉద్దేశంతోనే వీటి ముద్ర‌ణ‌ను నిలిపివేసిన‌ట్లు తెలుస్తోంది. 2016లో నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌భుత్వం తొలిసారి రూ.2000 నోటును తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Related Posts