YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ – భరోసేకా వాదా ద్వారా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారం,

లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ – భరోసేకా వాదా ద్వారా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారం,

హైదరాబాద్ మార్చ్ 15
భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఇటీవల ప్రారంభించిన ‘భరోసేకా వాదా’ అనే టెలివిజన్ వాణిజ్య ప్రచార కార్యక్రమం ద్వారా 360 డిగ్రీల బీమా అవగాహన కార్యక్రమాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన టివిసి హైలైట్స్ - క్లెయిమ్‌ల సత్వర పరిష్కారం, డిజిటల్‌గా వ్యవవస్థీకృతం చేయబడిన ఎటువంటి ఆటంకాలు లేని ప్రక్రియల గురించి లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క హామీ, మరియు విశ్వసనీయత యొక్క అంతర్లీన సందేశాన్ని తెలియజేస్తుంది మరియు వినియోగదారులు కోరుకున్న దాన్ని అందజేస్తుంది.ఈ టివిసి లో రెండు ఆకస్మిక ప్రమాదాల వల్ల రెండు కుటుంబాలలో వారి సాధారణ జీవిత గమనంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురయ్యాలో  సూచించే రెండు సమాంతర కథలను ఈ టీవీసీ లో చూపించడం జరిగింది.  మరియు లిబర్టీ జనరల్ యొక్క శీఘ్ర క్లెయిమ్ పరిష్కారాలు మరియు డిజిటల్-ఇంటిగ్రేటెడ్ ప్రక్రియలు ఆ  కుటుంబాలను ఆటుపోట్ల నుండి  ఎలా రక్షిస్తాయో వివరించడం జరిగింది. ఈ రెండు కుటుంబాల కథల ద్వారా, వారి విరుద్ధమైన, కాని అనుసంధానమైన జీవితాల సంగ్రహావలోకనం, మరియు విశ్వసనీయత మరియు బాధ్యత అనే సూత్రం  వారిని ఎలా కలుపుతుంది గమనించవచ్చు.ఈ సందర్బంగా లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సిఈఓ మరియు పూర్తికాల డైరెక్టర్ శ్రీ రూపం ఆస్థాన మాట్లాడుతూ “ప్రస్తుతం ఉన్న మరియు సంభావ్య కస్టమర్ల జీవితాలలో జరిగి ఊహించని సంఘటనల రక్షణకు మా బ్రాండ్ వాగ్దానాన్ని వర్ణించే కథాంశాన్ని మేము రూపొందించాము. ముఖ్యంగా ఈ ‘భరోసెకా వాదా’ ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఇది చాలా సందర్భోచితంగా ఉంటుంది. దీన్ని అనువదిస్తే ‘నమ్మకంతో కూడిన వాగ్దానం’ అనే అర్థం వస్తుంది. ఈ ట్యాగ్ లైన్ వినియోగదారుల పాటల మాకున్న బాధ్యతను, నమ్మకంతో కూడిన విలలువల పట్ల మాకున్న నిబద్ధతను సూచిస్తుందని తెలిపారు.లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ బ్యాంక్ అస్సూరెన్స్ అండ్ అఫినిటీ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్, పర్సనల్ లైన్స్ శ్రీ అమిత్ జైన్ మాట్లాడుతూ “తాము సురక్షితంగా ఉన్నామన్న భావనను ప్రజల్లో కల్పించినపుడే పురోగతి  సాధ్యమన్న అంశాన్ని ఈ ప్రచారం ద్వారా లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ ప్రజల్లోకి తీసుకు వెళ్తోంది. క్లెయిమ్స్ ను స్త్వరమే సెటిల్ చేయడం తో పాటు ఇన్సూరెన్స్ ప్రయాణంలో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావలసిన సేవలను అందించడం కొరకే మేము నిరంతరం కృషి చేస్తున్నాం” అన్నారు.ఈ క్యాంపెయిన్ సందర్భంగా మార్కెటింగ్ & డిజిటల్ బిజినెస్ హెడ్ గౌరవ్ దూబే మాట్లాడుతూ “మేముఈ360-డిగ్రీలఇంటిగ్రేటెడ్ క్యాంపెయిన్‌ను టీవీ, రేడియో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ డిస్ప్లే మరియు సోషల్ మీడియా వంటి అన్నీ మాధ్యమాలలో ప్రచారమయ్యే విధంగా రూపొందించినట్లు తెలిపారు.. వినియోగదారులను కలవడానికి వీలున్న అన్ని మార్గాల ద్వారా వారిని చేరుకోవాలన్నదే లక్ష్యం. ఈ ప్రచారంతో లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ ప్రాంతీయ మార్కెట్లలోని వినియోగదారులకు మైండ్ రీకాల్ పెంచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Related Posts