YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ సిటీ...కాదు..పోర్టు సిటీ పొయో

 స్టీల్ సిటీ...కాదు..పోర్టు సిటీ పొయో

విశాఖపట్టణం, మార్చి 16, వెనకటికి ఒక ముతక సామెత ఉంది. డోలొచ్చి మద్దెలతో తన గోడు చెప్పుకుందని, దాన్ని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటే ఉక్కు తో పోర్టు తన బాధను చెప్పుకుంది అనాలేమో. అవును మరి ఒక వైపు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ ఉక్కుకే దిక్కు లేని పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకు ఉక్కుని అప్పగించేందుకు రెండేళ్ళ క్రీతమే ఒప్పందాలు కుదిరాయని కూడా ప్రచారంలో ఉంది.ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ ఓ వైపు కార్మిక లోకమంతా ఏకమై ఆందోళన చేస్తున్నా కూడా కేంద్రం అసలు లెక్కచేయడంలేదు. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించి జోరుగా కధ నడుపుతోంది. ఇదిలా ఉంటే ఇపుడు దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేట్ పరం చేస్తామంటూ ఏకంగా ప్రధాని మోడీ తాజాగా పోర్టుల మీద జరిగిన ఒక వెబ్ నార్ లో చెప్పుకొచ్చారు. 2024 నాటికి ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ముగిసేలా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ కేంద్రం ముందుకు సాగుతోంది.
విశాఖలోని హిందుస్థాన్ జింక్ కర్మాగారాన్ని గతంలో ప్రైవేట్ పరం చేశారు. ఇపుడు అది సిటీలో మచ్చుకు కూడా కనిపించడంలేదు. దానికి తీసుకున్న వేదాంత గ్రూప్ సంస్థ నష్టాల సాకు చూపి మూసేసింది. ఆ భూములలో ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆ మధ్యన బీహెచ్ పీవీని కూడా ప్రైవేట్ పరం చేస్తామని ముందుకు ఉరికారు కానీ ప్రస్తుతానికి ఆగిపోయారు. ఇపుడు ఉక్కు వంటి అతి భారీ కర్మాగారం మీదనే కన్నేశారు. ఇక 19వ శతాబ్దం మొదటిలో బ్రిటిష్ వారి ద్వారా ప్రారంభం అయిన విశాఖ పోర్టుని ప్రైవేట్ రూట్ పట్టించాలనుకుంటున్నారు.విశాఖను పోర్ట్ సిటీ అని పిలుస్తారు. ఉక్కు నగరం అని చక్కగా అభివర్ణిస్తారు. అయితే ఈ పేర్లు భవిష్యత్తులో ఇలాగే ఉంటాయా అంటే చెప్పడం కష్టమే. బీజేపీ నాయకులు ఇవి ఎక్కడికీ పోవు అని చెబుతున్నారు. కానీ జాతీయ సంపదగా ఇవి ఉండవు అన్నది తేలుతున్న సత్యం. విశాఖలో ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. పాతవి మూత పడితే కొత్తవి పుడుతున్నాయి. కానీ అవేవీ విశాఖ కీర్తి కిరీటంలో ఎప్పటికీ చేరలేవు. ఇపుడు దేశంలోనే అతి పెద్ద పోర్టుగా ఉన్న విశాఖ పోర్టుని కూడా ప్రైవేట్ బాట పట్టిస్తే గతమంతా ఘనకీర్తి అన్న మాటే విశాఖకు మిగులుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఉక్కు కర్మాగారానికి, పోర్టుకు కూడా వేలాది భూములు ఉన్నాయి. మరి వాటి కోసమే ప్రైవేటీకరణ అయితే విశాఖ సంపద సాగరంలో కలసిపోయినట్లే.

Related Posts