YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ కు ఎన్నికల కష్టాలు

కాంగ్రెస్ కు ఎన్నికల కష్టాలు

హైదరాబాద్, మార్చి 16, 
లంగాణలో కాంగ్రెస్ కు వరసగా వచ్చి పడే ఎన్నికలు మరింత బలహీన పరుస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ నేతలు ఏ ఎన్నికలు రాకూడదని పదే పదే కోరుకుంటున్నారు. ఒకేసారి సాధారణ ఎన్నికలకు వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నది వారి మనోగతం. కానీ వారి ప్రమేయం లేకుండానే వరసగా ఎన్నికలు వచ్చి పడుతుండటం, ఓటమి పాలు కావడం, పార్టీలో నిరాశ పెరిగిపోవడం రివాజుగా మారింది. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై మాత్రం కాంగ్రెస్ చాలా హోప్స్ పెట్టుకుంది.నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తుంది. సర్వేల మీద సర్వేలు చేయించుకుంటుంది. బలహీనంగా ఉన్న మండలాలను గుర్తించి అక్కడ బలోపేతం అయ్యేందుకు వ్యూహాలను రచించుకుంటుంది. మండలాలే కాదు గ్రామ స్థాయిలోనూ సామాజికవర్గాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ నేతలు తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ ఇక్కడ అభ్యర్థి. జానారెడ్డి సీనియర్ నేత కావడం, గత ఎన్నికల్లోనూ స్వల్ప మెజారిటీతోనే ఓడిపోవడంతో ఆ సానుభూతి పనిచేస్తుందని కాంగ్రెస్ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు కారు స్పీడ్ కు బ్రేకులు వేయగలమన్న నమ్మకంతో ఉన్నారు. జానారెడ్డి ఇప్పటికే నియోజకవర్గమంతా పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి కొంత సానుకూలత లభిస్తుండటంతో పెద్దాయన రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు.కానీ ఎన్నికలంటే చెప్పలేం. పూర్తిగా అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఇది సిట్టింగ్ స్థానం కావడంతో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే సాగర్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ మరో మూడేళ్లు ఉంటుంది. దీంతో ప్రజల తీర్పు ఎలా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ఇక ఇంతేసంగతులని చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి నేతలు ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. సాగర్ లో ఫలితం తిరగబడితే మరింత మంది పార్టీ నుంచి వెళ్లిపోతారన్నది ఖాయం కన్పిస్తుంది.

Related Posts